ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు

   తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాస్క్ ఫోర్స్ మాజీ డిసిపి రాధా కిషన్‌ రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాధా కిషన్ రావు వాంగ్మూలంలో మాజీ సీఎం కేసీఆర్ పేరును పదే పదే ప్రస్తావించారు. ఈ కేసులో తొలిసారి కేసీఆర్‌ పేరు వెలుగులోకి వచ్చింది. కెసిఆర్ కుటుంబ సభ్యులు, పార్టీలో సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకు తాము పనిచేశామని రాధా కిషన్ రావు చెప్పారు. ఫోన్ టాపింగ్ తో ప్రణీత్‌ రావు వెల్లడించే వివరాల ఆధారంగా రాజకీయనేతలు, వారికి ఆర్థికంగా సహాయం చేసే వారిని లొంగదీసుకున్నామని వివరించాడు.

    సివిల్ తగాదాల్లో సెటిల్మెంట్ చేస్తూ ఎన్నికల సమయంలో వారి నగదును అడ్డుకున్నామని రాధాకిషన్‌ రావు చెప్పారు. BRS కు చెందిన నగదు తరలింపులో తాము సహకరించమన్నారు. 2017 లో ఎస్పీగా ప్రమోషన్ వచ్చిన తర్వాత తనను టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ నియమించడంలో SIB మాజీ చీఫ్‌ ప్రభాకర్ రావు పాత్ర కీలకమని వెల్లడించారు. BRS పార్టీ కార్యకలాపాలు చెక్కదిదెందుకే తనను ఏరి కోరి మరీ టాస్క్ ఫోర్స్ డిసిపి గా నియామకం చేశారని చెప్పారు. టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియామకం తర్వాత కెసిఆర్ అత్యంత సన్నిహితుల కార్యకలాపాలను చెక్కబెట్టానని తన వాగ్మూలంలో చెప్పారు రాధాకిషన్‌ రావు. అధికార పార్టీ నగదు రవాణాకు ప్రణీత్ రావుతో సమన్వయం చేసుకోవాలని ప్రభాకర్ రావు ఆదేశాలు ఇచ్చే వాడని వివరించాడు. కెసిఆర్‌కు లబ్ధి చేకూరేలా ప్రభాకర్ రావు ప్రత్యేక పనులు తనకు అప్పగించే వాడని.. అడిషనల్ ఎస్పీ భుజంగరావు ప్రతి విషయాన్ని ప్రగతిభవన్లో కేసీఆర్ కు స్వయంగా వెళ్లి సమాచారం ఇచ్చేవాడని చెప్పాడు రాధాకిషన్‌ రావు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్