తెలంగాణలో రానున్న 4 రోజులు తీవ్ర ఎండలు

    తెలంగాణలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. భగ భగ మండే ఎండలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. తీవ్ర మైన ఎండ వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 44 డిగ్రీల కంటే ఎక్కువే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం 46 డిగ్రీలు దాటింది. రానున్న నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హైదరాబాద్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

   కరీంనగర్‌, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, మహబూబ్‌నగర్‌, భూపాలపల్లిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రెండు రోజులు ఉమ్మడి ఆది లాబాద్‌, కరీంనగర్‌,భద్రాద్రి, నిజామాబాద్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌లో హై టెంపరేచర్స్‌ రికార్డు అవు తాయని హెచ్చరించింది. దాంతో ఆయా జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. తెలంగాణలో18 జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకూ ఎక్కువ అవుతుండటంతో పలు జిల్లాలకు రెడ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రానున్న నాలుగైదు రోజుల్లో నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచి ర్యాల, కొత్తగూడెం, ఖమ్మ,, సూర్యాపేట, నల్లగొండ, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణ పేట తదితర జిల్లాల్లో తీవ్ర స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్డ్ జారీ చేశారు. ఈ నెల 5వ తేదీ వరకూ వేసవి తీవ్రత మరింత పెరుగుతుందని అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

   రాష్ట్రంలో గురువారం నల్లగొండ జిల్లా ఇబ్రహీంపేటలో 46.6 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సూర్యాపేట జిల్లా మునగాల, జగిత్యాల జిల్లా నేరెళ్ళలో 46.4 డిగ్రీల చొప్పున, మంచిర్యాల జిల్లా జన్నారం లో 46.2 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లిలో 46.2 డిగ్రీలు, వరంగల్ జిల్లా గొర్రెకుంటలో 46.1 డిగ్రీలు, నాగర్‌కర్నూల్ జిల్లా కిస్టంపల్లిలో 46 డిగ్రీల చొప్పున రికార్డు స్థాయి పగటి ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. రాష్ట్రంలో 22 జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు.. మిగిలిన జిల్లాల్లో 43.8 నుంచి 45 డిగ్రీల మధ్యలో నమోదయ్యాయి. వడదెబ్బ కారణంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా నలుగురు ప్రాణాలు కోల్పో యారు. ఈ సీజన్‌లో సాధరణంతో పోలిస్తే 4 డిగ్రీలు ఎక్కువగా ఎండలు కాస్తున్నట్లు ప్రాంతీయ వాతావ రణ కేంద్రం వెల్లడించింది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్