25.1 C
Hyderabad
Saturday, February 21, 2026
spot_img

ఎవరి లెక్కలు వారివే! గెలుపు ఎవరిదో !

2024 లో కాషాయదళం ప్రచారం చేసుకుంటున్నట్లు.. తీస్రీ బార్ మోదీ సర్కార్.. అధికారంలోకి వస్తుందా.. ఇండియా కూటమి ఆశిస్తున్నట్లు ప్రజాస్వామ్యం ప్రవిఢవిల్లి కూటమి సర్కార్ ను ఏర్పాటు చేస్తుందా.. లేదా మరో సారి హంగ్ ఏర్పడి.. ప్రాంతీయ పార్టీలు కింగ్ మేకర్ పాత్ర పోషించి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా.. బీజేపీ, కాంగ్రెస్ కూటమి తామే అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉంటే… కాంగ్రెస్, బీజేపీ లు అధికారం అంచులకు రావని, ప్రాంతీయ పార్టీలే కేంద్ర సర్కార్ ను నిర్ణయిస్తాయని బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ అంటున్నారు.. ఎవరి లెక్కలు వారివే..

అన్ని పార్టీల ధ్యేయం అధికారమే. 2014 లో నరేంద్రమోదీ ప్రభంజనం సాగింది. 2019లో ఆ ప్రభ కొనసాగింది.. ప్రస్తుతం మోదీ మ్యాజిక్ పనిచేయడం లేదు. 2023లో హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో బీజేపీ ఫ్లాప్ షోతో ఇది స్పష్టమైంది. పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ సర్కార్ కు ఈ ఎన్నికల్లో ఎదురు గాలి వీస్తున్న సూచనలు కన్పించడంతో ఒక పక్క ఇండియా కూటమి, మరో పక్క పలు ప్రాంతీయ పార్టీలు 2024 లోక్ సభ ఎన్నికలపై ఆశలు పెంచుకున్నాయి. ఇండియా కూటమి ఢిల్లీ గద్దె తమదే అన్న ధీమాతో ఉంది.

సిద్ధాంత పరమైన వైరుధ్యం, వేర్వేరు విధానాలు, భిన్నాభిప్రాయాలు గల ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపై నిలవడం కష్టమే. అయినా ఇండియా కూటమి పేరుతో ప్రతిపక్షాలు ఏకతాటి పైకి వచ్చాయి. పార్లమెంటులోని 543 స్థానాల్లోనూ బీజేపీ కీ వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి నిలిపి, కమలదళాన్ని చిత్తుచేయాలని భావించినా, ఆచరణలో సాధ్యం కాలేదు. పశ్చిమబెంగాల్ లో మమత బెనర్జీ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళలో కమ్యూనిస్ట్ ల ఆధ్వర్యంలోని ఎల్డీఎఫ్ తమ తమ రాష్ట్రాల్లో ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. దీంతో పలు చోట్ల బీజేపీ కి వ్యతిరేకంగా, ఇండియా కూటమి పార్టీల మధ్య ఫ్రెండ్లీ వార్ సాగుతోంది. అయినా కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమా వ్యక్తమవుతోంది.

    తెలంగాణ ముఖ్యమంత్రి, టి. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  ఈ సారి కేంద్రంలో కచ్చితంగా ఇండియా కూటమి ఘనవిజయం సాధిస్తుందని ఢంకా బజాయించి చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ అధికారంలోకి రాదని.. మోదీకి అంత సీన్ లేదని స్పష్టం చేస్తున్నారు. ఎన్డీఏకు చార్ సౌ, బీజేపీకి 370 సీట్లు అన్న మోదీ మాటలకు తూట్లు పొడిచారు. 2014లో కానీ 287, 2019 లో కానీ.. 303 సీట్లకే పరిమితమైన మోదీ పార్టీ 400 ఎలా సాధిస్తుందని తనదైన శైలిలో లెక్కచూపారు. రాజస్థాన్, గుజరాత్, హర్యానా, బీహార్, ఢిల్లీలలో గతంలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసినా, యూపీలో 80 సీట్లలో 62 సాధించిననాడు కూడా బీజేపీ స్కోర్ 303 దాటలేదన్నారు. దక్షిణాదిలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీలో కలిసి 130 సీట్లు ఉంటే బీజేపీకి 15 కన్నా ఎక్కువ సీట్లు దక్కవన్నారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసిఆర్ వాదన మరోలా ఉంది. కేంద్రంలో బీజేపీ కానీ, కాంగ్రెస్ కూటమి కానీ అధికారంలోకి రావని కేసీఆర్ అన్నారు. ఈ సారి హంగ్ తప్పదని, ప్రాంతీయ పార్టీలే అత్యధిక సీట్లు గెలుచుకుని కొత్త ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారతాయన్నారు. ఆ కూర్పు గురించి ఇప్పుడే మాట్లాడడం తొందరపాటే కాగలదంటూనే.. కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందన్న భావన వ్యక్తం చేశారు. కేసీఆర్. తన ప్రచార సభల్లోనూ, కేంద్రంలో హంగ్ ఏర్పడడం ఖాయమని, భవిష్యత్ లో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలకం కాగలదని చెబుతున్నారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతారని కూడా ఖమ్మం సభలో కేసీఆర్ జోస్యం చెప్పారు. అలాగే బీజేపీ తనకు లొంగని రాష్ర ప్రభుత్వాలపై కక్షతో వ్యవహరిస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణలో కేసీఆర్ పై కక్షతోనే ఢిల్లీ మద్యం కుంభకోణానికి తెరలేపారని, అది బీజేపీ రాజకీయ స్కామ్ అన్నారు.

ఇక బీజేపీ ప్రధాని మోదీ లెక్క మరో లా ఉంది. మోదీ, అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా లోక్ సభ ఎన్నికల్లో ఎదురులేని విజయం లభిస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఎన్నికల ప్రకటనకు ముందు ఇస్ బార్ 400 పార్, తీస్రీ బార్ మోదీసర్కార్ అంటూనే బీజేపీ 370, ఎన్డీఏ 400 సీట్లు గెలుస్తుందనే ప్రకటించారు. ఎలా గెలుస్తుందంటే.. ఆయన లెక్క ఆయనది. చూద్దాం. జూన్ 4న కేంద్రంలో ఏ సర్కార్  వస్తుందో.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్