35.8 C
Hyderabad
Friday, March 13, 2026
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

రాగిడి లక్ష్మారెడ్డి రోడ్ షో

మల్కాజ్ గిరి ప్రాంతాన్ని అభివృద్ధికి ఆమడదూరంలో ఉంచిన రేవంత్‌రెడ్డికి ఓట్లు అడిగే నైతిక హక్కులేదన్నారు బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి. ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపు తథ్యమన్నారు నేతలు.

నామినేషన్ తిరస్కరణ

ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున వేసిన నామినేషన్‌ తిరస్కరణ పై ఆ పార్టీ నేతలు స్పందించారు. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణునారాయణ మీడియాతో మాట్లాడు తూ ఆర్డీఓ శివరామిరెడ్డి తీరును తప్పుపట్టారు. పాత అఫిడవిట్ చూసి రిజెక్ట్ లెటర్ ఇవ్వడం దారుణ మన్నారు. కలిసేందుకు వెళితే సమయం ఇవ్వకపోవడం దారుణమన్నారు.

సైబర్‌ ఫిర్యాదుల పరిశీలన

ములుగు జిల్లాలో నూతన సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేషన్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు జిల్లా ఎస్పీ డా. శబరిష్. సైబర్‌ ఫిర్యాదుల పరిశీలన, ఆన్లైన్‌ మోసాల పట్ల అవగాహనా కార్యక్రమాలు ఈ సెంటర్‌ ద్వారా పొందవచ్చన్నారు. సైబర్‌ మోసాలకు గురైన వారు 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలన్న ఎస్పీ ఫోన్ ల్లో వచ్చే లింక్ లు, బ్యాంకు సంబంధిత ఓ టీ పి, పాస్వర్డ్ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.

బెల్ట్ షాప్ తనిఖీలు

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు బెల్ట్‌ షాపులపై కొరఢా ఝళిపిం చారు. కోడూరు గ్రామంలో చేపట్టిన తనిఖీల్లో 63వేల రూపాయలు విలువగల మద్యంను స్వాధీనప ర్చుకున్నారు. ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలో సిబ్బంది ఈ తనిఖీలను చేపట్టారు.

నకిలీ తాళాలతో చోరి

మనోజ్‌ అనే హోమ్‌గార్డ్‌ ఆదోని స్టేషన్‌లోనే దొంగతనం చేసి అడ్డంగా దొరికాడు. సీఐ జీప్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇతను ఈజీమనీకి అలవాటుపడ్డాడు. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న నగదుపై కన్నేసిన మనోజ్‌ ప్రాపర్టీ రూమ్‌ నకిలీ తాళాలు తయారుచేసి 5.63 లక్షలు కాజేసాడు. విచారణ చేసిన అధికారులు మనోజ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుండి 3 లక్షల రూపాయలను రికవరీ చేసారు.

నగదు సీజ్

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో భారీగా నగదు పట్టుబడింది. జగన్నాధపురం గ్రామ శివారు అంతజిల్లా చెక్పోస్ట్ వద్ద 2 లక్షల 40 వేల రూపాయల నగదును ఎటువంటి పత్రాలు చూపని కారణంగా సీజ్‌ చేసారు. తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ నుండి రాజమండ్రి వెళ్తున్న ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు లో ఈ నగదు బైటపడింది.

సైబర్ నేరస్తుల మోసాలు

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో రెండు వేర్వేరు కేసుల్లో 20 లక్షల రూపాయల నగదును దోచేసారు సైబర్ మోసగాళ్లు. ఏపీఆర్ కాలనీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి నుంచి లాడర్ గేమ్ పేరుతో 2.13 లక్షలు.. చిట్కుల్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిని నుంచి ఆన్లైన్ జాబ్ పేరుతో 18 లక్షల రూపాయలు కేజేసారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు పటాన్‌చెరు పోలీసులు.

అల్లుడిపై మామ దాడి

అల్లుడిపై మామ దాడిచేసి గాయపర్చిన ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది. బుట్టాయిగూడెం కు చెందిన నందిపాము రాంబాబు కుమార్తె సాయి, కార్తీక్ అనే వ్యక్తిని వివాహమా డింది. ఈ వివాహం అంగీకరించని రాంబాబు కార్తీక్‌పై కక్ష పెంచుకున్న క్రమంలో ఈ దాడి జరిగినట్లు కార్తీక్‌ తల్లి ఆరోపించింది. క్షతగాత్రున్ని చికిత్సకై ఆస్పత్రికి తరలించి జంగారెడ్డిగూడెం పోలీసులు విచారణ చేపట్టారు.

గ్రీన్ నెట్స్ తో ఉపశమనం

మండుతున్న ఎండల నుండి వాహనదారులకు కాస్తంత ఉపశమనం కల్పించింది పుదుచ్చేరి ప్రభుత్వం. ప్రజా పనుల విభాగం ఆధ్వర్యంలో పుదుచ్చేరి వ్యాప్తంగా పలు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద కొంత దూరం వరకు వీటిని ఏర్పాటు చేసారు. పుదుచ్చేరి అధికారులు చేసిన ఈ ప్రయత్నాన్ని సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు హర్షం వ్యక్తం చేసారు.

నోటీసులు పంపిన ఇళయరాజా

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్ధకు సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసు పంపారు. ఓ చిత్రం టైటిల్‌ టీజర్లో తన సంగీతాన్ని అనుమతిలేకుండా వాడారంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. ఆ పాట సంగీతాన్ని వెంటనే తొలగించాలని, లేకుంటే ఆ పాటకు తగిన అనుమతి పొందాలని నోటీసులో పేర్కొన్నారు. అలా కాని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తోందని స్పష్టం చేసారు.

బిగ్ బి అమితాబ్ వీడియో

  బిగ్‌ బి అమితాబ్‌ తన కొత్త చిత్రం కల్కిలోని అశ్వత్ధామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం సామాజిక మాధ్యమంలో పంచుకుంది. అమితాబ్‌ గళం వినిపిస్తుండగా తెరపై రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, హార్దిక్‌ పాండ్య తదితర క్రికెటర్లను చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అయ్యింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్