ఏపీలో గ్లాస్ సింబల్ జనసేనదే కోర్టు తీర్పు

ఏపీలో ఎన్డీయే కూటమికి సింబల్‌ గుబులు రేగుతోంది. ఏపీలో గ్లాస్ సింబల్ పై కన్ ఫ్యూజన్ నెలకొంది. గాజు గ్లాస్ కామన్ సింబల్ గా మారడంతో కూటమికి రెబల్స్ షాక్ ఇస్తున్నారు. జనసేన పోటీ చేయని చోట్ల వేరే వాళ్లకు గాజు గ్లాసు సింబల్ ను కేటాయించింది ఈసీ. ఇలా 3 ఎంపీ, 16 అసెంబ్లీ స్థానాల్లో ఇతరులకు గ్లాసు గుర్తును కేటాయించింది. జనసేన పోటీ చేయని చోట గ్లాస్ ఫ్రీ సింబల్ అని, నిబంధనల ప్రకారమే ఇలా కేటాయించామని ఈసీ వర్గాలు తెలిపాయి. దీంతో జనసేన హైకోర్టును ఆశ్రయించింది. తమకు కేటాయించిన గ్లాస్‌ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించొద్దని విజ్ఞప్తి చేసింది. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.

బీజేపీ ఎంపీ అభ్యర్థులు బరిలో ఉన్న అనకాపల్లి, రాజమహేంద్రవరంలో ఇతరులకు గ్లాస్ గుర్తును కేటాయించింది ఈసీ. నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ఒక అభ్యర్థికి గ్లాసు గుర్తును కేటాయించింది ఈసీ. ఉమ్మడి గోదావరి జిల్లాలో పలువురు అభ్యర్థులకు గ్లాస్ గుర్తు ఇచ్చారు. పెద్దాపురం, కాకినాడ సిటీ, రామచంద్రపురం అభ్యర్థులకు గ్లాస్ గుర్తు కేటాయించారు. అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట అభ్యర్థులకూ గ్లాస్ సింబల్ ఇచ్చింది ఈసీ. మండపేట, కొవ్వూరులో వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు.నవతరం పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కృష్ణ కిశోర్ కి గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. విజయవాడ సెంట్రల్ లో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థి గొల్లపల్లి ఫణిరాజ్ కి, మైలవరంలో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని నాగపవన్ కూ గ్లాస్ గుర్తును ఇచ్చారు. విజయనగరం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రెబల్ మీసాల గీతకు, టెక్కలిలో స్వతంత్ర అభ్యర్థి అట్టాడ రాజేశ్ కు, బాపట్లలో ఇండిపెండెంట్ అభ్యర్థి డీ.సీతారామరాజుకు, జగ్గంపేటలో స్వతంత్ర అభ్యర్థి సూర్యచంద్రకు, చిత్తూరు జిల్లాలో మూడు చోట్ల గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. తాజాగా హూ హైకోర్టు విచారణలో జనసేన వాదనల అనంతరం హైకోర్టు గ్లాస్ సింబల్ జనసేనదేనని తీర్సు ఇచ్చింది.దీంతో జనసేనలు ఊపిరి పీల్చుకున్నాయి.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్