పరిధి దాటి ప్రవర్తిస్తున్న లీసులు

      కొందరు పోలీసులు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సొంత లాభం కోసం అధికారాలను దుర్వినియోగం చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కొన్ని ఘటనల్లో పోలీసులపై పోలీసులే కేసులు నమోదు చేయాల్సిన పరిస్థితి వస్తోందంటున్నారు ఆయా గ్రామాల ప్రజలు. ఆదిలాబాద్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఓ యువతి ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో హెడ్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు అయింది. మరో కేసులో నిజామాబాద్ మండలంలో నిందితురాలికి కోర్టు సమన్లు ఇచ్చేందుకు వెళ్లిన రూరల్ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్ మైనర్‌ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఫిర్యాదుతో అతనిని సస్పెండ్ చేశారు. భూపా లపల్లి వీఆర్ సీఐపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదయి కటకటాలలోకి వెళ్లారు. ఒక అత్యాచారం కేసులో టాస్క్‌ఫోర్స్ ఇనస్పెక్టర్ సస్పెండయ్యారు. ఖాకీ డ్రెస్సు మాటున కొందరు పోలీసులు దౌర్జన్యాలు, దాదాగిరి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సివిల్ తగాదాల్లో, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కొందరు పోలీసులు జోక్యం చేసుకుంటున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయి. ఇలాంటి పోలీసులపై ఆ శాఖ ఉన్నతాధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటే ఇవి పునరావృతం కావని పలు వురు అభిప్రాయపడుతున్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్