సారీ చెప్పిన బాలయ్య

దేవ బ్రాహ్మణుల్ని ఉద్దేశించి హీరో బాలక్రిష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. రావణాసురుడి వారసులు అన్న రీతిలో ఆయన మాట్లాడినట్లుగా సోషల్ మీడియాలో గుప్పుమంటోంది. ఈ వ్యాఖ్యలు బాగా వైరల్ కావటంతో ఈ వ్యాఖ్యలు కోసం నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. దీంతో ఈ కామెంట్స్ అన్ని ప్రాంతాలకు పాకిపోయింది.

ఆంధ్రప్రదేశ్ లోని బీసీ కులాల్లో దేవ బ్రాహ్మణ కులస్తులు ఎక్కువగానే కనిపిస్తారు. కొన్ని గ్రామాల్లో గణనీయమైన సంఖ్యలో ఈ సామాజిక వర్గం ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో బీసీ సంఘాల్లో ఈ కులస్తులు చురుకైన పాత్ర పోషిస్తారు. అందుచేత బాలయ్య చేసిన వ్యాఖ్యలు బీసీలను కించపరిచేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తాయి. ఈ దుమారాన్ని తెలుగుదేశం పెద్దలు గమనించి అప్రమత్తం అయ్యారు. వెంటనే బాలక్రిష్ణ కు పరిస్థితిని వివరించినట్లు సమాచారం.

ఈ వ్యాఖ్యల మీద బాలయ్య వెంటనే వివరణ ఇచ్చారు. పొరపాటుని మన్నించాలంటూ వివరణ ఇచ్చారు. ఈ మాటల వల్ల దేవాంగుల మనో భావాలు దెబ్బతిన్నాయని తెలిసి బాధ పడ్డానని, ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచనే తనకు లేదని ఆయన వివరించారు. సాటి సోదరుల మనసు గాయపరచాలని అనుకోవటం లేదని స్పష్టం చేశారు.

సాధారణంగా ఆవేశంగా మాట్లాడుతుండే బాలయ్య.. ఈ వివాదంలో వెంటనే జాగ్రత్త పడ్డారు. బీసీ వర్గాల్లో అనవసరపు వివాదాలకు దారి తీయకుండా ఉండేందుకు వెంటనే వివరణ ఇచ్చారు. హుందాగా సారీ చెప్పటంతో ఈ వివాదం ముగిసిందని భావిస్తున్నారు

Latest Articles

బండి సంజయ్‌కు మంత్రి పదవి సేఫ్‌గా ఉన్నట్లేనా?

కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్‌వ్యవస్థీకరణపై ఢిల్లీ రాజకీయాల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని వస్తుండటంతో కేబినెట్ ప్రక్షాళనకు ముహూర్తం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెండు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్