తెలుగు నాట డిజిటల్ మీడియాలో పాపులర్ షో గా అన్ స్టాపబుల్ పేరు తెచ్చుకొంది. అనేక సార్లు హ్యాష్ టాగ్ ట్రెండింగ్స్ లోకి ఈ షో పేరు సంపాదించుకొంటోంది. బాలక్రిష్ణ హోస్ట్ గా ఉన్న ఈ షో కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా రావటం సినీ, రాజకీయ వర్గాల్లో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ షో కోసం అభిమానులు వేయి కళ్ల తో ఎదురు చూస్తున్నారు.
‘అన్‌స్టాపబుల్-2’ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. అసలు టాక్ షోలకే రాని పవన్ కళ్యాణ్ మొదటి సారి టాక్ షోకు.. అది కూడా బాలయ్య హోస్ట్ చేస్తున్న షోకు రావడం తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. వారిద్ధరి మధ్య మాట ముచ్చట ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు తీవ్ర ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆహా సంస్థ పవన్ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో పవన్ కళ్యాణ్ వేదికపైకి రావడం చూపించారు. ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్‌ను కూడా ప్రకటించకపోయినా రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఎపిసోడ్ విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అన్ స్టాప బుల్ షో లో పవన్ కళ్యాణ్ ఏమేం చెప్పారు అనే దాని కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. రాజకీయాలు మాట్లాడారా సినిమాలకే పరిమితం అయ్యారా, సెన్సేషనల్ విషయాలు బయట పెట్టారా అన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది