కాజల్ ‘సత్యభామ’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. “సత్యభామ” సినిమా మే 17వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.

ఇవాళ “సత్యభామ” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘కళ్లారా చూసాలే..’ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను బ్యూటిఫుల్ మెలొడీగా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేశారు. రాంబాబు గోసాల లిరిక్స్ అందించగా..క్వీన్ ఆఫ్ మెలొడీ శ్రేయా ఘోషల్ పాడారు. సత్యభామ, అమరేందర్ యూనివర్సిటీలో కలిసి చదువుకున్నప్పటి నుంచీ తమ లవ్ జర్నీని ఈ పాటలో గుర్తు చేసుకుంటారు. ‘కళ్లారా చూసాలే..నువ్వేనా నువ్వే నేనా, గుండెల్లో దాచాలే నిన్నేనా నా నిన్నేనా నీ ఊహల గుస గుస పదనిసలై ఉయ్యాలే ఊపేనా నీ ఊసుల మధురిమ హృదయమునే మైకంలో ముంచేసేనా’..అంటూ సాగుతుందీ పాట. “సత్యభామ” సినిమాకు ‘కళ్లారా చూసాలే..’ పాట ప్రత్యేక ఆకర్షణ కానుంది.

నటీనటులు – కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, తదితరులు

టెక్నికల్ టీమ్

బ్యానర్: అవురమ్ ఆర్ట్స్
స్క్రీన్ ప్లే, మూవీ ప్రెజెంటర్ : శశి కిరణ్ తిక్క
నిర్మాతలు : బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి
కో ప్రొడ్యూసర్ – బాలాజీ
సినిమాటోగ్రఫీ – బి విష్ణు
సీఈవో – కుమార్ శ్రీరామనేని
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
పీఆర్ఓ: జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
దర్శకత్వం: సుమన్ చిక్కాల

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్