ఖమ్మం కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇంతవరకు కాంగ్రెస్ మూడు స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. ఇందులో హైదరాబాద్, కరీంనగర్ స్థానాలపై క్లారిటీ వచ్చేసింది. కానీ ఖమ్మం అభ్యర్థిపై ఇంకా తర్జనభర్జన పడుతోంది. అధిష్ఠానం అధికారికంగా ప్రకటించక పోయినా ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున మద్దతుదార్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీవీ గౌతమ్కు రెండు సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు. వాటిలో ఆయనను కాంగ్రెస్ అభ్యర్థిగా పేర్కొన్నారు. ఆయనతో పాటు పార్టీ నాయకుడు రాయల నాగేశ్వరరావు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వ రరావు పేర్లు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నాయి. పొంగులేటి వియ్యంకుడు నామినేషన్ వేయడంతో ప్రియాంక గాంధీని ఖమ్మం బరిలో దింపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టుబడు తున్నట్లు సమాచారం. ఖర్గేతో భేటీ అనంతరం కొత్తగా ప్రియాంకను నిలబెట్టాలనే డిమాండ్ అధిష్టానం ముందుం చారు.
రసవత్తరంగా ఖమ్మం కాంగ్రెస్ పాలిటిక్స్
0
184
Previous article
Latest Articles
తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత
తిరుపతి జిల్లా:
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -
- Advertisement -


