దేశంలో కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా నరేంద్ర మోదీకీ మద్దతు పలుకుతున్నారని అన్నారు కొండా సంగీతారెడ్డి. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ కార్పొరేషన్ లో ఆమె తన భర్త, చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి నరేంద్రమోదీని ప్రధానమంత్రిని చేయడానికి యావత్ దేశం మొత్తం సిద్ధమైందని చెప్పారు. మోదీ ఆర్థిక విధానాలు, సంస్కరణల ఫలితంగానే దేశం ఇవాళ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించడం ద్వారా చేవెళ్లను అభివృద్ధి పథంలో నడిపించవచ్చని కొండా సంగీతారెడ్డి స్పష్టం చేశారు.
మోదీని మరోసారి ప్రధాని చేయడానికి యావత్ దేశం సిద్ధం – సంగీతారెడ్డి
0
282
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


