విశాఖలో సీఎం జగన్‌ను కలిసిన స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు

    విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్ వైభవం కోసం తమ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషిచేస్తోందని సీఎం జగన్‌ అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై నిరంతరంగా ఒత్తిడి చేస్తూనే ఉందని చెప్పారు. మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు ఎండాడ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులు సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ ఉక్కు కర్మాగారం సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు కార్మిక సంఘాల నాయకులు. ఈ సందర్భంలో స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో తమది రాజీ లేని ధోరణి సీఎం స్పష్టం చేశారు.

    విశాఖ స్టీల్ ప్లాంట్ పునర్ వైభవానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, వైయస్సార్సీపీ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు అండగా నిలుస్తుందని చెప్పారు. ఈ సమస్యపై మొదటిసారిగా కార్మికుల తరపున రాష్ట్ర ప్రభుత్వమే గళమెత్తిందని తెలిపారు. తొలిసారిగా ప్రధానికి లేఖ కూడా రాశామని, స్టీల్ ప్లాంట్ కర్మాగారం అంశంపై పరిష్కారాలు కూడా సూచించామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని సీఎం జగన్ గుర్తు చేశారు.

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్