ఏపీలో ఉపాధి అవకాశాలు లభించక మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం బేతపూడిలో ఆమె పర్యటించారు. పూల తోటలో మహిళా కూలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి పూలు కోశారు. రాజధాని లేకపోవడంతో ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కూలీలు బ్రాహ్మణి దృష్టికి తీసుకువచ్చారు. మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దడమే నారా లోకేశ్ విజన్ తెలిపారు. మహిళల సంక్షేమానికి చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టారని బ్రాహ్మణి చెప్పారు.


