నేటితో 18వ రోజుకు చేరుకున్న జగన్‌ బస్సుయాత్ర

వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. ప్రజల నుంచి యాత్రకు భారీ స్పందన వస్తోంది. జగన్‌ ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. బస్సు యాత్రలో భాగంగా ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు జగన్‌. ఇవాళ 18వ రోజు యాత్రలో భాగంగా సీఎం జగన్‌ రాత్రి బస చేసిన ST రాజపురం ప్రాంతం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది.రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్‌ మీదుగా ఉందురు క్రాస్‌ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. ఆయన ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్‌ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్‌ వద్దకు చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్‌ మీదుగా గొడిచర్ల క్రాస్‌ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్