మసీదుపై మాధవీ లత బాణం

   హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధి మాధవీలత మసీదుపై బాణం వేస్తున్నట్లు చేసిన చర్యలపై mim అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఇలాంటి చర్యల వల్ల తెలంగాణ శాంతికి భంగం వాటిల్లుతుందని, హైదరాబాద్ ప్రజలు వీడియోలు చూస్తున్నారని, వారి కళ్లు మూయించలేరని, ఇలాంటివి ప్రజలు సహించరని అన్నారు. ప్రజలు వారి ఉద్దేశాలను గమనిస్తున్నారని, బీజేపీ- ఆర్ఎస్ఎస్ యొక్క రెచ్చగొట్టే చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించరని అన్నారు. ఈ చర్యలతో ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని, నరేంద్ర మోదీ సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటే ఇదేనా? బీజేపీ పదే పదే చెప్పే వికసిత్ భారత్ అంటే ఇదేనా అని ఓవైసీ ప్రశ్నించారు. తమకు ఎన్నికల కంటే హైదరాబాద్ శాంతి ముఖ్యమని, తెలంగాణ ప్రజలు రాష్ట్రం శాంతికి ప్రతికూలంగా వ్యవహరించే బీజేపీకి వ్యతిరేఖంగా ఓటు వేస్తారని మాకు నమ్మకం ఉందని తెలిపారు. కాగా శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా ర్యాలీ నిర్వహించిన ఆమె.. మసీదు వద్దకు రాగానే బాణం తీసి వేస్తున్నట్లు గా నటించారు. దీనికి సంబందించిన వీడియోలు సోషల్
మీడి యాలో వైరల్ గా మారి రాజకీయంగా చర్చకు దారితీసింది.

Latest Articles

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష

రాజధాని పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్లు హాజరయ్యారు. అమరావతిలో ప్రాజెక్టుల వారీగా పనుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్