దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికమ ర్చంట్‌ల ప్రీవెడ్డింగ్ వేడుక ఇటీవల అంగరంగ వైభవంగా జరిగింది. త్వరలో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ఇందుకోసం ఆ జంట షాపింగ్ చేస్తున్నారు. తాజాగా దుబాయ్‌లో షాపింగ్ చేస్తూ ఈ జంట కనిపించింది. ఇక సంపన్నుల షాపింగ్ కావడంతో భారీ బందోబస్తుతో వెళ్లారు. అనంత్-రాధికలు కూడా భారీ సెక్యూరిటీ మధ్య లగ్జరీ కార్లతో దుబాయ్‌లోని విలాసవంతమైన సిటీ వాక్ మాల్‌లో ప్రత్యక్ష మయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
అనంత్-రాధికల జంట దాదాపు 10 కోట్లు విలువ చేసే రోల్స్‌రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ మోడల్ కారులో మాల్‌లోకి ప్రవేశించారు. వారిచుట్టూ భారీ సెక్యూరిటీ ఉంది. దాంతోపాటు లగ్జరీ కార్లతో సెక్యూరిటీ కాన్వాయ్‌ను ఏర్పాటు చేశారు. ఆ కాన్వాయ్‌లో కాడిలాక్ ఎస్కలేడ్స్, జీఎంసీ యుకోన్ డెనాలిస్, చేవ్రొలెట్ సబర్బన్‌తోపాటు ఓ అంబులెన్స్ కూడా ఉంది. చివరకు వారు షాపింగ్ చేసిన లగేజీ తెచ్చుకోవడానికి సుమారు 25 కోట్ల విలువైన ఆ కార్ల కాన్వాయ్‌ను వినియోగించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అనంత్ రిలయన్స్ న్యూ ఎనర్జీ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. 2024 జులైలో అనంత్-రాధిక వివాహం చేసుకోనున్నారు.


