హైదరాబాద్ మెట్రో ప్రయాణించే ప్రయాణికులకు షాక్ తగిలింది. ప్రయాణికులకు ఎంతో ఉపయోగ కరంగా ఉండే 59 రూపాయాల హాలిడే కార్డును మెట్రో రద్దు చేసింది. మార్చి 31తో ఈ ఆఫర్ ముగిసిందని అధికారులు తెలిపారు. ఈ కార్డుతో 59 రూపాయలు చెల్లించి ఒక రోజంతా నగరంలోని మెట్రో రైళ్లలో అపరిమితంగా ప్రయాణించే వీలుండేది. ఆదివారం, రెండో శనివారంతో పాటు ఇతర సెలవు రోజుల్లో ఇది అందుబాటులో ఉండేది. దీనితో పాటు సాధారణ రోజుల్లో ప్రయాణికుల కోసం అందుబాటులో ఉండేలా గతంలో తీసుకొచ్చిన 10 శాతం రాయితీని కూడా ఎత్తేసినట్లు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో మెట్రో కార్డును ప్రయాణికులు కొనుగోలు చేస్తే- తెల్లవార జామున 6 నుంచి ఉదయం 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి అర్ధరాత్రి వరకు ప్రయాణ ఛార్జీలో కల్పించే 10 శాతం రాయితీ ఉండేది. దీన్ని సైతం అధికారులు ఎత్తివేసినట్లు తెలుస్తోంది. మెట్రో రైల్ ప్రయాణానికి భారీగా డిమాండ్ పెరిగినందు వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్
0
250
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


