రాహుల్ గాంధీకి ట్విట్టర్ వేదికగా కేటీఆర్ సవాల్

     కాంగ్రెస్‌ పార్టీపై బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫైరయ్యారు. పార్టీ ఫిరాయింపులపై స్పందించిన కేటీఆర్‌.. దేశంలో ఇతర పార్టీల నుంచి నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. తాను ప్రారంభించిన ఆయారాం గయారాం సంస్కృతి పైన ఇప్పటికైనా తన విధానం మార్చుకోవడం మంచిదేనన్నారు. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో పార్టీ మారితే వెంటనే సభ్యత్వం రద్దు అనే హామీని పేర్కొనడం స్వాగతించదగినదని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలాగానే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుందని విమర్శించారు KTR.

      హామీ ఇచ్చిన దానికి పూర్తి వ్యతిరేకంగా కాంగ్రెస్ విధానాలు ఉంటాయని ఆరోపించారు. ఒకవైపు తన మ్యానిఫెస్టోలో ఇతర పార్టీల నుంచి చేర్చుకోమంటూనే తెలంగాణలో కారు గుర్తుపై గెలిచిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఎంపీ టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు. మరొక బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను రాజీనామా చేయకుండానే తన పార్టీలో కలుపుకుందని సెటైర్‌ వేశారు. రాహుల్ గాంధీకి తమ హామీలపైన నిబద్ధత ఉంటే ఫిరాయింపులపై మాట్లాడాలని అన్నారు. లేకుంటే ఆయన హిపోక్రట్ గా మిగిలిపోతారన్నారు. ఇప్పటికైనా బిఆర్ఎస్ నుంచి చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలని.. లేదా స్పీకర్ ద్వారా అనర్హత వేటు వేయించడం ద్వారా తాము చెప్పిందే చేస్తామని నిరూపించుకోవాల న్నారు. అబద్ధా లు చెప్పమనే విషయాన్ని దేశానికి నిరూపించుకోవాలని రాహుల్ గాంధీకి ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరా రు కేటీఆర్.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్