జన జాతర సభకు సర్వం సిద్ధం

    తుక్కుగూడ సభ కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో 10 ఏళ్లనాటి పూర్వవైభవాన్ని చాటింది. ఈ సెంటిమెంట్‌తోనే తుక్కుగూడ వేదికగా పార్లమెంట్‌ ఎన్నికల సమరశంఖాన్ని పూరించేందుకు సిద్ధమైంది. దేశ ప్రజలను ఆకట్టుకునేలా జన జాతర పేరుతో భారీ ఎత్తున సభ నిర్వహిస్తోంది.

    లోక్‌సభ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టిన కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల శంఖారావానికి సిద్దమైంది. తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్న ఆ పార్టీ అదే జోష్‌తో దేశంలోనూ విక్టరీ కొట్టాలన్న కుతూహలంతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడ సభ కలిసి రావడంతో.. అదే వేదిక నుంచి ప్రచారాన్ని షూరూ చేయనుంది. దేశ ప్రజలను ఆకట్టుకునేలా జనజాతర పేరుతో ఈ సభను నిర్వహిస్తోంది. ఇక సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సభకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు అగ్రనేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంకగాంధీ హాజరుకానున్నారు. తుక్కుగూడ సభా వేదిక నుంచి కాంగ్రెస్‌ జాతీయ మేనిఫె స్టోను తెలుగులో విడుదల చేయనుంది. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అమలు చేసే స్కీమ్‌లను ప్రత్యేకంగా విడుదల చేయనుంది. రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల విస్తరణ, హైదరాబాద్ నుంచి అన్ని పట్టణాలకు రైళ్ల సంఖ్య పెంపు, భద్రాచలానికి స్పెషల్ ట్రైన్లు, సైనిక్ స్కూళ్ల ఏర్పాటు, మైనింగ్ యూనివర్సిటీ, జిల్లాల్లోనూ పారిశ్రామిక కారిడార్లు, మూసీ నదీ ప్రక్షాళనను కేంద్రం నుంచి స్పెషల్ ఫండ్ వంటి అంశాలు ప్రధానంగా మేనిఫెస్టోలో ఉంటాయంటున్నారు పీసీసీ నేతలు.

జనజాతర సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది హస్తం పార్టీ. ఈ మేరకు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తూనే.. 10 లక్షల మంది టార్గెట్‌గా జనసమీకరణపై ఫోకస్‌ పెట్టింది. అందులో ప్రధానంగా లక్షమంది మహిళలను వేదిక ముందు వరసలో కూర్చోబెట్టి.. తాము అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలకు థ్యాంక్స్‌ చెప్పించేం దుకు ఏర్పాట్లు చేస్తోంది. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకం వంటి గ్యారెంటీ స్కీంలతో మహిళలు సంతోషంగా ఉన్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే తెలంగాణ ఎన్నిక‌ల్లో ఆరు గ్యారెంటీల హామీ ప్రజ‌ల్లోకి దూసుకెళ్లిన‌ట్లు గానే లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ఇచ్చే అయిదు గ్యారెంటీలు దేశంలోని అన్ని మూల‌ల‌కు, అన్ని వ‌ర్గాల్లోకి వెళ్తా యని కాంగ్రెస్‌ హైకమాండ్‌ బలంగా నమ్ముతోంది.

60 ఎకరాల మైదానంలో జనజాతర సభ జరగనుంది. వాహ‌నాల పార్కింగ్‌కు సుమారు 300 ఎక‌రాల స్థలాన్ని కేటాయించారు. ఇక ఈ సభకు పార్టీ అగ్రనేతలు తరలివస్తుండటంతో స్వయంగా సీఎం రేవంత్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభకు ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశిం చారు. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెప్టెంబర్‌ 17న విజ‌య‌భేరి పేరుతో ఇక్కడ నుంచే సమర శంఖం పూరించింది కాంగ్రెస్‌. ఈ సభా వేదిక నుంచి సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీ లను ప్రకటించి వారి విశ్వాసాన్ని చూరగొని భారీ విజయాన్ని సాధించారు. దీంతో తుక్కుగూడ తమకు కలిసిరావడం సెంటిమెంట్‌గా భావిస్తూ జనజాతర సభను నిర్వహిస్తోంది. మరి అసెంబ్లీ ఎన్నికల మాదిరే దేశంలోనూ కాంగ్రెస్ విక్టరీ కొడుతుందా..? సెంటిమెంట్‌ నమ్ముకున్న అగ్రనేతల ఆశలు ఫలిస్తాయా అన్నది తెలియాలంటే ఎన్నికలు పూర్తయి ఫలితాలు వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్