ఏపీ అభివృద్ధి చెందాలన్నా.. హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్నను ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే మళ్లీ వైసీపీ టికెట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను కాపాడుకునేందుకే సీఎం పదవిని జగన్ వాడుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ జిల్లా కాశినాయన మండలం అమగంపల్లిలో బస్సు యాత్రను ఆమె ప్రారంభించారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రత్యేకహోదా తీసుకొస్తానని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చాక బీజేపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. ‘హోదా’ వచ్చి ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి ఉండే వని. రాజధాని లేదు.. పోలవరం పూర్తికాలేదు.. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధీ జరగలేదన్నారు. ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలను ప్రజలంతా దీవించాలని వివేకా కుమార్తె సునీత కోరారు. తన తండ్రిని చంపిన వాళ్లకు, షర్మిలకు మధ్య పోటీ జరుగుతోందన్నారు. ఆమెను ఎంపీగా చేయాలనేది వివేకా చివరి కోరికని.. దాన్ని నెరవేర్చాలన్నారు. అవినాష్‌రెడ్డిని ఓడించాలని ఆమె పిలుపునిచ్చారు.
ఏపీ సీఎం జగన్‌పై షర్మిల ఆరోపణలు
0
422
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


