కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్యోగం పేరిట టోకరా కలకలం సృష్టించింది. అంగన్వాడీ సూపర్‌వైజర్ గ్రేడ్-2 పోస్ట్ ఇప్పిస్తానంటూ..ఓ వైసీపీ జడ్పీటీసీ దంపతులు మోసం చేసిన వ్యవహారం ఇప్పుడు స్థానికం గా తీవ్ర దుమారం రేపుతోంది. తమ డబ్బులు తిరిగి చెల్లించాలంటూ ఇంటికెళ్తే కుక్కలతో దాడి చేయిస్తు న్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చల్లపల్లి జడ్పీటీసీ రాజులపాటి కల్యాణి, శివ ప్రసాద్ ల మోసాలు ఒక్కసారిగా బయట పడ్డాయి.
ఉద్యోగం ఇప్పిస్తానంటూ జడ్పీటీసీ దంపతులు తమ వద్ద 7లక్షల 65వేల నగదు వసూలు చేశారని.. లక్ష్మీపురం పంచా యతీ ఇండిపెండెంట్ అభ్యర్థి వార్డు మెంబర్ శ్రీనివాసరావు, సుమలత దంపతులు చెప్పారు. ఇద్దరు మినిస్టర్లు పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్‌తో రికమెండేషన్ చెపిస్తానంటూ నమ్మ బలికినట్లు తెలిపారు. ఈనేపథ్యంలోనే ఉద్యోగం ఇవ్వకపోవగా, డబ్బులు అడిగే కుక్కలతో దాడులు చేయిస్తున్నారని కన్నీరుమున్నీరు అయ్యారు. ఈ విషయం పోలీసులకు చెప్తే కారుతో గుద్ది చంపుతామని బెదిరించినట్లు చెప్పారు. పోలీసులే తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు శ్రీనివాసరావు దంపతులు.


