అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేనకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. కాకినాడ జిల్లా ముమ్మడి వరం జనసేన టికెట్ ఆశించిన పితాని బాలకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతు న్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా టీడీపీకి ముమ్మడివరం టికెట్ కేటాయించడంతో పితాని బాలకృష్ణ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అలకపాన్పు ఎక్కిన పితాని అమరావతిలో పవన్‌ను కలిసి తన రాజకీయ భవిష్యత్‌పై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. అయితే ఆ చర్చలు ఎంతవరకు సఫలీ కృతమయ్యాయో తెలియదు కానీ పితాని బాలకృష్ణ మాత్రం జనసేనకు రాజీనామా చేసి వైసీపీలో చేరుతు న్నట్లు తెలుస్తోంది.శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పితాని బాలకృష్ణ ముమ్మడి వరం నియోజక వర్గంలో బలమైన నాయకుడు. గత ఎన్నికల్లో పితాని బాలకృష్ణనే తొలి అభ్యర్థి గా ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అయితే ఇప్పుడు సీటు కేటాయించకపో వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పితాని. తాజాగా వైసీపీ అధిష్టానం నుంచి పితానికి గట్టి హామీ రావడంతో ఆయన అధికార వైసీపీలో చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
జనసేనలో కొనసాగుతున్న అసంతృప్తుల పర్వం
0
434
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


