నవీన్ చంద్ర ‘ఇన్స్‌పెక్టర్ రిషి’ ట్రైలర్ రిలీజ్

నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన తమిళ ఒరిజినల్ హారర్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘ఇన్స్‌పెక్టర్ రిషి’  ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్ విడుదల చేసింది. నందిని JS రూపొందించిన ఈ సిరీస్ లో నవీన్ చంద్ర టైటిల్ పాత్రలో నటించారు. సునైనా, కన్నా రవి, మాలినీ జీవరత్నం, శ్రీకృష్ణ దయాళ్, కుమారవేల్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. పది ఎపిసోడ్‌ల సిరీస్‌ను ప్రైమ్ వీడియోలో 240కి పైగా దేశాల్లో మార్చి 29న ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

ఈ సిరీస్‌ను తమిళనాడులోని ఒక సుందరమైన గ్రామం, పచ్చదనంతో నిండిన అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు. అనూహ్యమరణాలతో ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ తో ఈ సిరీస్ ను చిత్రీకరించారు. ఇన్‌స్పెక్టర్, రిషి, ఇద్దరు సబ్-ఇన్‌స్పెక్టర్లు అయ్యనార్, చిత్రతో కలిసి అడవి రహస్యాలను వెలికితీసే సాహసాలు చేస్తారు. ఈ ముగ్గురూ తమ వ్యక్తిగత జీవితంలోని సవాళ్లు ఎదుర్కోవడమే కాకుండా, వారి సంకల్పం, సామర్థ్యాలను పరిమితికి పరీక్షించే ఆటలో అతీత శక్తులతో పోరాడుతారు.

“ఇన్‌స్పెక్టర్ రిషి పాత్రను పోషించడం సవాలుతో కూడుకున్న పాత్ర. ఈ ధారావాహిక నాకు ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్ యొక్క బహుముఖ స్వభావాన్ని అన్వేషించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందించింది. తద్వారా నేను పాత్రకు కొత్త తరహాను అందించాను. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోతో నా రెండో సిరీస్ కాబట్టి ఇన్‌స్పెక్టర్ రిషి పాత్ర పట్ల నా ఉత్సాహం పెరిగింది. ఈ సిరీస్ తో ప్రేక్షకులు ప్రేమలో పడతారని నేను నిజంగా ఆశిస్తున్నాను.’’ అని నవీన్ చంద్ర చెప్పుకొచ్చారు.

“ఇన్‌స్పెక్టర్ రిషిలో ఫారెస్ట్ ఆఫీసర్ క్యాథీ పాత్రను నేను చేశాను. దర్శకుడు నా పాత్రను చాలా వివరంగా చూపిస్తారు. ఆ క్యారెక్టర్‌లో లక్షణాలు నాకు చాలా నచ్చాయి. సెట్‌లోని వాతావరణం, ప్రతిభావంతులైన నటీనటులు, సిబ్బందితో కలిసి, కాథీ సున్నితమైన, భీకరమైన వ్యక్తిత్వాన్ని పూర్తిగా చూపించడానికి నాకు అవకాశం లభించింది.” అని సునైనా తెలిపారు. నందిని JS  మాట్లాడుతూ.. ప్రైమ్ వీడియోతో పని చేసిన అనుభవం సాధారణమైనది కాదని.. ఇన్‌స్పెక్టర్ రిషితో ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాము అని చెప్పగలను’’ అని ధీమా వ్యక్తం చేశారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్