ఎలక్టోరల్ బాండ్ లకు సంబంధించిన డేటాను తగిన సమయంలో ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుందని ప్రధాన ఎన్నిక ల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని గతంలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. మార్చి 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా బ్యాంకు షేర్ చేసిన వివరాలను అధికారిక వెబ్ సైట్ లో ప్రచురిం చాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది.ఎన్నికల కమిషన్ పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తుందని.. ఎస్ బీఐ సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రకారం తమకు ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన డేటా అందజేసిందని.. దానిని తాము సకాలంలో వెల్లడిస్తామని ఈసీఈ వివరించారు. జమ్ముకశ్మీర్ లో ఎన్నికల సన్నాహాలను సమీక్షించిన అనంతరం శ్రీనగర్ లో విలేక రుల సమావేశంలో సీఈసీ ఈ వ్యాఖ్యలు చేశారు. 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 వరకు మొత్తం 22,217 బాండ్లను కొనుగోలు చేశారని ఎస్ బీఐ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో తెలిపింది. ఇదే వివరాలను ఎన్నికల కమిషన్ కు ఎస్ బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా తెలిపారు.
ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం ఆదేశాన్ని పాటించిన ఎస్బీఐ
0
262
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


