రాజకీయాల్లోకి మరో స్టార్ క్రికెటర్

     మరో స్టార్‌ క్రికెటర్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. టీమ్‌ఇండియా పేసర్‌ మహమ్మద్‌ షమి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పశ్చిమ బెంగాల్‌ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో పోటీ విషయమై ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ఈ క్రికెటర్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఈ చర్చలు సానుకూ లంగా జరిగాయని, అయితే పార్టీ ప్రతిపాదనపై షమి తన నిర్ణయాన్ని ఇంకా చెప్పలేదని కమలం వర్గాలు అంటున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌ హత్ నియోజకవర్గం నుంచి ఆయనను బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోం ది. తద్వారా మైనార్టీల ఓట్లను ఆకర్షించాలనేది కాషాయ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. ప్రస్తుతం బసిర్‌హత్‌ నియోజకవర్గానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున నుస్రత్‌ జహాన్‌ ఎంపీగా ఉన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సందేశ్‌ఖాలీ ప్రాంతం ఈ నియోజకవర్గ పరిధిలోనిదే.

    ఇటీవలే షమి తన కుడికాలి చీలమండకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో ఈ నెలాఖరున ప్రారంభమయ్యే ఐపీఎల్‌ సీజన్‌ మొత్తానికి దూరమయ్యారు. ఈ సర్జరీ విషయాన్ని షమి సోషల్‌ మీడియాలో వెల్లడించగా.. మోదీ స్పందించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గతేడాది వన్డే ప్రపంచకప్‌ టోర్నీ ఫైనల్‌లో భారత్‌ ఓడిపోయిన తర్వాత కూడా ప్రధాని టీమిండియా ఆటగాళ్లను కలిసి ఓదార్చారు. ఆ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన షమిని మోదీ ప్రత్యేకంగా అభినందించారు.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్