రష్యా యుద్ధాన్ని ఎగదోస్తున్న ఉత్తర కొరియా !

    కిమ్ జోంగ్ ఉన్   పేరే ఒక సంచలనం. ఆయన ఏం చేసినా సంచలనమే. ఏం మాట్లాడినా సంచల నమే. రష్యాకు కంటైనర్లలో భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి పంపియుద్ధాన్ని ఎగదోస్తు న్నాడు. కొన్నినెలల కిందట రష్యాతో ఆయుధాల ఒప్పందం చేసుకున్నాడు. కిమ్ ఉత్తరకొరియా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆ దేశం ఎడాపెడా క్షిపణుల ప్రయోగం చేస్తోంది. క్షిపణుల ప్రయోగంపై ఐక్య రాజ్యసమితి ఆంక్షలున్నా కిమ్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఉత్తరకొరియా అందించే ఆయు ధాలతో ఉక్రెయిన్‌పై మళ్లీ భీకరంగా విరుచుకుపడటానికి రష్యా సన్నద్దమవు తోంది.

     రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగియదని చాలా స్పష్టంగా తెలుస్తోంది. రష్యా అధినేత పుతిన్ హుంకరిం పులకు భయపడి ఉక్రెయిన్ యుద్ధంలో ఎవరూ జోక్యం చేసుకోవడం లేదు. ఐక్యరాజ్యసమితి ఉన్నా, ఉక్రెయిన్‌పై సైనిక చర్యలను నిలువరించడానికి చేసిందేమీ లేదు. రష్యా – ఉక్రెయిన్ విషయంలో ఐక్యరాజ్యసమితి ప్రపంచదేశాల్లో తన విలువ పోగొట్టుకుంది. ఇదిలా ఉంటే ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ యుద్ధోన్మాదిలా ప్రవర్తిస్తున్నాడు. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యాను ఎగదోస్తున్నాడు. తాజాగా రష్యాకు ఉత్తరకొరియాకు భారీ ఎత్తున ఆయుధాలు తరలించారు. మాస్కోకు మందుగుండు కొరతను కిమ్ తీరుస్తున్నాడు. కిందటేడాది జులై నుంచి లెక్కలు తీస్తే ఇప్పటివరకు దాదాపు 6,700 షిప్పింగ్ కంటైనర్లలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని రష్యాకు ఉత్తర కొరియా తరలించినట్లు తెలిసింది. ఇక అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం గత సెప్టెంబర్ నుంచి దాదాపు పది వేల కంటైనర్ల లో రష్యాకు ఉత్తరకొరియా ఆయుధాలు తరలించింది. ఉత్తరకొరియా అందించిన మందు గుండు సామగ్రితో ఉక్రెయిన్‌ను స్మశానంలా మార్చడానికి రష్యా బలగాలు సన్నద్ధమవుతున్నాయి.

    కిమ్ జోంగ్ ఉన్ కిందటేడాది రైలెక్కి రష్యా వెళ్లారు. ఆయుధాల సరఫరాకు సంబంధించి పుతిన్‌తో కిమ్‌ ఒప్పందం చేసుకున్నాడు. అప్పటికి రష్యా- ఉక్రెయిన్ యుద్దం ప్రారంభమై 14 నెలలైంది. ఉక్రెయిన్‌ తో జరుగుతున్న యుద్ధంలో రష్యా బాగా అలసిపోయింది. ఒక దశలో రష్యా దగ్గర ఆయుధాలు తగ్గిపో యాయి. ఈ నేపథ్యంలో రష్యాకు ఆయుధాలు అందచేసి యుద్ధాన్ని ఎగదోసింది ఉత్తరకొరియా. వాస్తవా నికి యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లో రష్యాదే పైచేయిగా ఉండేది. రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ చాలా చిన్న దేశం. దీంతో ఒక వారం రోజుల్లో ఉక్రెయిన్‌ దేశాన్ని ప్రపంచపటం నుంచి రష్యా కనుమరుగు చేస్తుం దని అందరూ భావించారు. అయితే అందరి ఊహాగానాలను తలకిందులు చేస్తూ ఉక్రెయిన్ నిలబ డింది. భారీ సంఖ్యలో సైనికులు, ప్రజలను కోల్పోయినప్పటికీ ఉక్రెయిన్ మనోధైర్యం కోల్పోలేదు. రష్యా సేనలకు దీటుగా బదులివ్వడం మొదలెట్టింది. కొన్ని నెలలపాటు రష్యా బలగాల దాడులను తట్టుకుం టూ ఉక్రెయిన్ యుద్ధరంగంలో నిలబడింది.

    ఈ దశలో రష్యాపై దాడులు చేద్దామంటే ఉక్రెయిన్ దగ్గర ఆయుధాలు ఉండేవి కావు. దీంతో రష్యాను ఎదుర్కోవడానికి ఆయుధాలు ఇవ్వవలసిందిగా అమెరికా సహా అనేక పశ్చిమ దేశాలను ఉక్రెయిన్ కోరింది. ఉక్రెయిన్‌ అడిగిందే తడవుగా అమెరికా సహా అనేక పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేశాయి. అలాంటి ఇలాంటి ఆయుధాలు కాదు. అత్యంత అధునాతన ఆయుధాలు. పశ్చిమ దేశాలు అందించిన ఆయుధాలతో ఉక్రెయిన్‌ యుద్ధ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసింది. అప్పటివరకు ఆత్మరక్షణలో ఉన్న ఉక్రెయిన్ ఒక్కసారిగా ప్రతీకార దాడులకు దిగింది. రష్యాపై ఉక్రెయిన్ ఎడాపెడా దాడులు మొదలెట్టింది. అసలు ఉక్రెయిన్ ఎదురుదాడులు చేస్తుందని రష్యా ఊహించలేదు. ఉక్రెయిన్ బలగాలకు దీటుగా కౌంటర్‌లు ఇవ్వాలని డిసైడ్ అయింది. అయితే రష్యా దగ్గర ఆయుధాలు తగ్గిపోయాయి.ఆయుధాల విషయంలో మొదటి నుంచి రష్యాకు అండగా నిలబడింది ఉత్తరకొరియానే. యుద్ధం ప్రారంభమైన తరువాత రష్యాకు ఉత్తరకొరియా ఆయుధాలు సరఫరా చేసింది. ఇదిలాఉంటే, ఉత్తరకొరియా అనగానే ఎవరికైనా వెంటనే గుర్తుకువచ్చేది క్షిపణులే. కిమ్‌ అధికారం చేపట్టాక, ఉత్తర కొరియా తరచూ క్షిపణి ప్రయోగాలు చేయడం మొదలైంది. కిందటేడాది జులైలో అమెరికా, ఉత్తర కొరియా మధ్య మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈనేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్ సోదరి యో జోంగ్‌ అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కథ అంతటితో ఆగలేదు. అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన మర్నాడే ఉత్తర కొరియా ఖండాతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించింది.

కిమ్ జోంగ్ ఉన్ ఓ యుద్ధ పిపాసి !
కిమ్ జోంగ్ ఉన్…ఆ పేరే ఒక సంచలనం. ఆయన ఏం చేసినా ఏం మాట్లాడినా అంతా సంచలనమే. కిమ్ 2011లో ఉత్తరకొరియా పాలకుడు కావడం కూడా ఓ సంచలనమే. ఉత్తరకొరియా పాలకుడు అయ్యే నాటికి కిమ్ జోంగ్ ఉన్‌కు ఉన్న రాజకీయ అనుభవం కూడా బాగా తక్కువ. అయితే వారసత్వ రాజకీయా ల నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్‌కు ఉత్తరకొరియా పగ్గాలు దక్కాయి. మౌలికంగా కిమ్‌ జోంగ్ ఉన్‌ … ఓ యుద్ధ పిపాసి. అంతేకాదు అగ్రరాజ్యమైన అమెరికాకు కొరకరాని కొయ్యగా మారాడు కిమ్‌. తరచూ అమెరికాకు హెచ్చరికలు జారీ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. కిమ్‌ నాయకత్వంలోని ఉత్తరకొరియా కిందటేడాది జరిపిన క్షిపణి ప్రయోగాలు అంతర్జాతీయ సమాజంలో హాట్‌టాపిక్‌ గా మారాయి. ఇదిలా ఉంటే దక్షిణ కొరియాకు అగ్రరాజ్యం అమెరికా దగ్గరవడం ఉత్తర కొరియాకు మింగుడపడటం లేదు. దీంతో ఉత్తరకొరియా రియాక్ట్ అయింది. ప్రత్యర్థి దేశాలపై వరుసగా క్షిపణులు ప్రయోగిస్తోంది. దక్షిణ కొరియాతోపాటు ఆ దేశానికి మద్దతు ఇస్తున్న అమెరికాకు కూడా ఉత్తరకొరియా హెచ్చరికలు జారీ చేస్తోంది.

ఇంగ్లీషు సినిమాలపై వేటు !
అందరు నియంతల్లాగే కిమ్ జోంగ్ ఉన్‌ కూడా బాగా భయస్తుడు. ఎప్పుడు, ఎవరు తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీస్తారోనని తరచూ భయపడుతుంటాడు. ఈ భయంలోనుంచే కొన్ని సంవత్సరాల కిందట ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఉత్తరకొరియాలో ఇంగ్లీషు సినిమాలను నిషేధించాడు. ఇంగ్లీషు సినిమాలు చూస్తూ పట్టుబడ్డ పిల్లలకు ఐదేళ్ల శిక్ష విధిస్తామని హెచ్చరించాడు. ఇంగ్లీషు సినిమా ల ప్రభావంతో తన సర్కార్‌పై ఎవరైనా తిరుగుబాటు లేవదీస్తారేమోనని భయంతోనే కిమ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నార్త్‌ కొరియా రాజకీయవర్గాల కథనం.దేశానికి అధ్యక్షుడు అయినా కిమ్‌ సహజంగా ఎవరితోనూ కలవడు. సామాన్య ప్రజల బాధలు ఏమాత్రం పట్టించుకోడు. అసలు కోటలాంటి ప్యాలెస్‌ నుంచి బయటకే రాడు. అమావాస్యకో…పౌర్ణానికో కోట దాటి బయటకు వస్తాడు.అలా వచ్చినా అది కూడా సైనికాధికారులతో భేటీ కావడానికే అయి ఉంటుంది. ముఖ్యంగా క్షిపణి ప్రయోగాలకు సంబంధించి చర్చలు జరపడానికే కిమ్ బయటకు వస్తుంటాడు. పరిపాలనకు సంబంధించిన ఎలాంటి విషయాలను కిమ్ ఎవరితోనూ మాట్లాడడు. ఆయన దగ్గర దేశం ఎదుర్కొంటున్న సమస్యలను ఎవరూ ప్రస్తావించరు. అంత ధైర్యం ఎవరూ చేయరు. ఎవరైనా ధైర్యం చేసి సమస్యల గురించి ప్రస్తావిస్తే…కిమ్ ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. ఏమైనా ఉత్తరకొరియాలో సమస్యలకు కొదవలేదు. అయితే వీటి విషయం ఏమాత్రం పట్టించుకోడు కిమ్‌. ఏదిఏమైనా ఓ యుద్ధ పిపాసిలా కిమ్ జోంగ్ ఉన్‌ ప్రవర్తిస్తున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Latest Articles

జనగణనలో ఓబీసీ కాలమ్ లేకపోవడంపై వివాదం

జనగణనలో కులగణన అంశం ఇప్పుడు అధికార భారతీయ జనతా పార్టీ మెడకు గట్టిగా చుట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాల లెక్కలు తేల్చాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తోంది. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్