శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

      శ్రీశైలం మహాక్షేత్రంలో మార్చి 1వ తేది నుండి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దేవస్థానం వైభవంగా నిర్వహించ నుంది. ఈ నేపథ్యంలో మార్చి 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల చేస్తున్న ట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. మార్చి 1 వతేది నుండి 11 వతేది వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్స వాలలో భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శినానికి మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఒక్క జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు మాత్రమే మార్చి 1 నుండి 5వ తేదీ సాయంత్రం ఏడున్నర వరకు నిర్దిష్ట వేలల్లో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తామన్నారు. మార్చి 5 వ తేదీ సాయంత్రం ఏడున్నర నుండి 11 వతేది వరకు భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. బ్రహ్మోత్సవాల సమయం లో భక్తులకు ఉచిత దర్శనంతోపాటు శీఘ్ర,అతి శీఘ్ర దర్శనానికి ఆన్‌లైన్‌, కరెంట్ బుకింగ్ కి ఏర్పాటు చేశామని ఈలయ ఈవో పెద్దిరాజు చెప్పారు.

 

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్