నేడు జనసేన, టీడీపీ ఉమ్మడి సమావేశం జరగనుంది. రెండు పార్టీల నేతలు కలసి రానున్న ఎన్నికల్లో కలసి నడిచేందుకు అవసరమైన రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయనున్నారు. దీంతో పాటు ఉమ్మడి మ్యానిఫేస్టో రూపకల్పన, ప్రచార వ్యూహాలపై చర్చ జరగనుంది. సీట్ల పంపకాలపై కూడా చర్చ జరపనున్నారు. ప్రధానంగా రెండు పార్టీలు ఉమ్మడి మ్యానిఫేస్టోను రూపొందించనున్నారు. ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో తొలి విడత మ్యానిఫేస్టోను చంద్రబాబు విడుదల చేశారు. మ్యానిఫేస్టోను ఈసారి ఉమ్మడిగా రూపొందించాలని నిర్ణయించారు. అందుకే రెండు పార్టీల నేతలు కలిసి కూర్చుని సమన్వయంతో మ్యానిఫేస్టోను రూపొందించనున్నారు. దీంతో పాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి పాల్గొనేలా సభలను ఏర్పాటు చేసేందుకు కూడా ఒక రోడ్డు మ్యాప్ ను రూపొందించనున్నారు.
టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన పై చర్చ
0
626
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


