హైదరాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నాయి. నిన్న లంచం తీసుకుంటూ జ్యోతి.. ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆమె ఇంట్లో జరిపిన సోదాల్లో 65 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. జగజ్యోతి ఇంట్లో రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకు న్నారు. బిల్లులు మంజూరుకు గుత్తేదారుల నుంచి 84 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇంట్లో సోదాల అనంతరం జ్యోతిని అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు.


