ఏపీలో పలు ఐఐఎం, ఐఐటీలను వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

     ప్రధాని మోదీ ఏపీలోని పలు విద్యాసంస్థలను వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. ఐఐటీ, ఐఐఎంలను ప్రారంభిస్తారు. విశాఖ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ శాశ్వత క్యాంపస్‌ను మోదీ, జగన్‌ వర్చువల్‌ విధా నంలో ప్రారంభించనున్నారు. 2015 నుంచి ఐఐఎం–విశాఖ కార్యకలాపాలను ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తు న్నారు. శాశ్వత భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ శివారు ఆనందపురం–గంభీరం పరిసర ప్రాంతాల్లో 241.50 ఎకరాల్ని ఉచితంగా కేటాయించింది. ఇందులో శాశ్వత భవన నిర్మాణం పూర్తి చేసే పనుల్ని రెండు దశల్లో చేపట్టారు. మొదటి దశలో 472.61 కోట్లతో పనులు పూర్తయ్యాయి. మొత్తం 62 వేల 350 చదరపు మీటర్ల విస్తీర్ణంలో బిల్డప్‌ ఏరియాని అభివృద్ధి చేశారు. తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ , ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ శాశ్వత క్యాంపస్‌లను కూడా ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌ విధానంలో జాతికి అంకితం చేయనున్నారు. ఈ మేరకు ఏర్పేడు సమీపంలోని రెండు క్యాంపస్‌ లలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏర్పేడు సమీపంలో రెండు విద్యా సంస్థలకు 895 ఎకరాలను వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కర్నూల్‌ ట్రిపుల్‌ ఐటీని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. గత టీడీపీ సర్కారు ట్రిపుల్‌ ఐటీకి 152 ఎకరాలు కేటాయిం చింది. 296 కోట్ల రూపాయలతో కర్నూల్‌ ట్రిపుల్‌ ఐటీ నిర్మాణం జరిగింది. మూడేళ్లలో కళాశాల భవన నిర్మాణాలు పూర్తికావడంతో ఇవాళ మోడీ వర్చువల్ విధానంలో ట్రిబుల్ ఐటీ కళాశాలను ప్రారంభిస్తున్నారు. కళాశాల ప్రారంభమైన నాటి నుంచి 843.56 లక్షల విలువైన పలు పరిశోధన ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని కళాశాల డైరెక్టర్ సోమయాజులు తెలిపారు. 14 పేటెంట్ ఇన్‌ స్టిట్యూట్‌కి దక్కాయన్నారు. నార్వే యూనివర్సిటీతో ఒప్పం దం కుదుర్చుకున్నట్లు చెప్పారు.

Latest Articles

ప్రారంభమైన.. క్రేజీ మల్టీస్టారర్..

పటాస్ సినిమా నుంచి మన శంకర్ వరప్రసాద్ గారు వరుకు ప్లాప్ అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తున్న హిట్ మిషన్ అనిల్ రావిపూడి (anil ravipudi). లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్