అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి చంపారు. పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేవీపల్లి మండలం చీనెపల్లె వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా అవుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి సమాచారం రావడంతో… సుండుపల్లి సరిహద్దు గొల్లపల్లి చెరువు వద్ద తనిఖీలు చేశారు. ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని కానిస్టేబుల్ గణేశ్ ఆపేందుకు యత్నించాడు. తప్పించుకునే క్రమంలో స్మగ్లర్లు అతడిని వాహనంతో ఢీకొట్టి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను పీలేరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పోలీసులు గాలింపు చేపట్టి… ఎర్రచందనం వాహనంతో సహా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసు వాహనాన్ని ఢీకొట్టి చంపిన ఎర్రచందనం స్మగ్లర్లు
0
311
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


