రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. తనకు ఎంపీగా అవకాశం కల్పించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతగా ఉంటానని చెప్పారు. తనను పార్లమెం టుకు పంపిన గుంటూరు ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. సభలో ఎందరో పెద్దలు తనకు మార్గదర్శకంగా నిలిచారని చెప్పారు. ప్రధాని మోదీ ఎంతో విజన్ ఉన్న నాయకుడని జయదేవ్ ప్రశంసించారు. పదేళ్ల మోదీ పాలనలో భారత్ ఎంతో పురోగమించిందని అన్నారు. అయోధ్య రామాలయాన్ని కట్టించి, భారతీయుల శతాబ్దాల కలను మోదీ నిజం చేశారని చెప్పారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో వ్యాపారులది కూడా కీలక పాత్ర అని గల్లా అన్నారు. ఎంతో మంది వ్యాపారవేత్తలు చట్ట సభలకు ఎన్నికవుతున్నారని తెలిపారు. వ్యారవేత్తలపై రాజకీయ కక్షలు సరికాదని… వారిపై రాజకీయ వేధింపులను నివారించాలని కోరారు. దేశం, రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్రను పోషిస్తూనే ఉంటానని చెప్పారు. రాముడు 14 ఏళ్లు వనవాసం చేసినట్టు తాను కూడా రాజకీయాల్లో విరామం తీసుకుంటున్నానని తెలిపారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని గల్లా జయదేవ్ స్పష్టం చేశారు.
రాజకీయాల నుంచి విరామం : గల్లా జయదేవ్
0
509
Previous article
Next article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


