33.9 C
Hyderabad
Thursday, March 5, 2026
spot_img

నోబెల్ శాంతి బహుమతి రేసులో డొనాల్డ్ ట్రంప్

        అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. రిపబ్లిక్ పార్టీ ఎంపీ క్లాడియా టెన్నీ ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించారు. ఈ విశిష్ట పురస్కారానికి ట్రంప్ పేరు నామినేట్ కావడం ఇది నాలుగోసారి. మధ్య ప్రాచ్యంలో గత 30 ఏళ్లలో తొలిసారిగా శాంతి ఒప్పందాలు కుదరడంలో డొనాల్డ్ ట్రంప్ కీలకపాత్ర పోషించారని టెన్నీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు పరిష్కారం చూపకుండా, మధ్యప్రాచ్యంలో అదనపు శాంతి ఒప్పందాలు కుదర్చడం అసాధ్యమని ప్రభుత్వ యంత్రాంగాలు, విదేశాంగ విధాన నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు దశాబ్దాలుగా భావిస్తూ వచ్చినా, ఆ వాదన తప్పు అని ట్రంప్ నిరూపించారని టెన్నీ వివరించారు. మధ్య ప్రాచ్యంలో శాంతి ఒప్పందాల రూపకల్పనకు ట్రంప్ సాహసోపేతమైన ప్రయత్నాలు చేశారని, అయితే ఆయన కృషి నోబెల్ శాంతి బహుమతి కమిటీ గుర్తింపునకు నోచుకోవడంలేదని ఆమె వివరించారు. అందుకే ఇవాళ ట్రంప్ పేరును నామినేట్ చేసినట్టు తెలిపారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్