ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరస్టయిన HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను 8 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ నాంపల్లి ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎనిమిది రోజుల పాటు బాలకృష్ణను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. విచారణ సందర్భంగా బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయనున్నారు.శివ బాలక్రిష్ణ మోసాలపై ఏసీబీ అధికారులు విచారణ చేయనున్నారు. శివ బాలకృష్ణ పని చేసిన సమయంలో ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని పరిశీలించాల ని ఏసీబీ నిర్ణయించింది. ఈ మేరకు హెచ్ఎండిఏ నుంచి ఫైల్స్‌ను తెప్పించుకుని విచారణ చేయనున్నారు.10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి ఏసీబీ కోర్టు 8 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. అధికారులు విచారణ వేగవంతం చేయనున్నారు. పుప్పాల గూడలో రూ. వేయి కోట్లు ప్రాజెక్టు అను మతులపై అవకతవకలు జరిగాయని.. దానికి సంబంధించిన ఫైల్స్ HMDA ఇవ్వాలని కోరుతూ సంబంధిత అధికారు లకు ఏసీబీ లేఖ రాసింది. హెచ్‌ఎండీఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేసిన శివబాలకృష్ణ.. అధికార దుర్విని యోగానికి పాల్పడడం ద్వారా కోట్లాది రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. వాటిపై ఫిర్యాదుల రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. బాలకృష్ణ ఇంటిలో సోదాలు నిర్వహించి, భారీగా నగదు, బంగారు నగలు, భూముల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ను 8 రోజుల కస్టడీకి ఇచ్చిన ఏసీబీ కోర్టు
0
565
Next article
Latest Articles
ఎమ్మెల్యేల పనితీరుపై కాంగ్రెస్ రహస్య సర్వే
తెలంగాణ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా చాలా ముందుగానే ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే కాంగ్రెస్ హైకమాండ్, సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో పావులు కదుపుతున్నారు. గత...
- Advertisement -
- Advertisement -


