ఫిబ్రవరి 15న మమ్ముట్టి ‘భ్రమయుగం’

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా ‘భ్రమయుగం’ అనే పీరియాడిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాని మలయాళంతో పాటు తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న ఈ సినిమాని ఫిబ్రవరి 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ నైట్ షిఫ్ట్ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా మలయాళ వెర్షన్ ఓవర్సీస్ థియేట్రికల్ డిస్ట్రిబ్యూటర్ “ట్రూత్ గ్లోబల్ ఫిల్మ్స్” రిలీజ్ చేస్తుండగా, కేరళ థియేట్రికల్ డిస్ట్రిబ్యూటర్ మిస్టర్ ఆంటో జోసెఫ్‌కి సంబంధించిన “AAN మెగా మీడియా” రిలీజ్ చేయనుంది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 నుంచి ఈ సినిమా మార్కెటింగ్ ప్రమోషన్స్‌ను నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ప్రారంభించింది.

ఇక ‘భ్రమ యుగం’ అనేది మమ్ముట్టి ప్రధాన పాత్రలో రాహుల్ సదాశివన్ స్వీయ దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మక నిర్మితమవుతున్న మలయాళ చిత్రం. ఈ బ్యానర్ ప్రత్యేకంగా హారర్-థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడానికి ఏర్పాటు చేసిన నిర్మాణ సంస్థ అని చెబుతున్నారు. ఈ క్రమంలో నైట్ షిఫ్ట్ స్టూడియోస్ – వైనాట్ స్టూడియోస్ సమర్పిస్తున్న ‘భ్రమయుగం’ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. చక్రవర్తి రామచంద్ర & ఎస్.శశికాంత్ నిర్మిస్తున్న ‘భ్రమయుగం’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా షెహనాద్ జలాల్, ప్రొడక్షన్ డిజైనర్‌గా జోతిష్ శంకర్, ఎడిటర్‌గా షఫీక్ మహమ్మద్ అలీ, సంగీత దర్శకుడిగా క్రిస్టో జేవియర్, మాటల రచయితగా టి.డి. రామకృష్ణన్ వ్యవహరిస్తున్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్