మాల్దీవులదిశగా చైనా పరిశోధన నౌక

      ప్రధాని మోదీ లక్షద్వీప్ వెళ్లిన నేపథ్యంలో భారత్ కు – మాల్దీవులకు మధ్య వివాదం తలెత్తిన తురుణంలో హిందూ మహా సముద్రంలో చైనా పరిశోధన నౌక మాల్దీవుల దిశగా కదులుతోంది. ప్రస్తుతం చైనా నౌక కదలికలు చర్చనీయాం శంగా మారింది. మాలె దిశగా వస్తోన్న ‘షియాంగ్ యాంగ్ హాంగ్ ౦3’నౌకపై భారత్ నేవీ దృష్టి సారించింది. చైన నౌక అక్కడ ఉన్నట్టు తమకు తెలుసని నేవీ అధికారులు జాతీయ మీడియాకు తెలిపారు. ఆ నౌక కదలికల్ని నిశితంగా గమనిస్తున్నట్టు వెల్లడించారు. ఇండియన్ ఈఈజెడ్ లో నౌక పరిశోధన కార్యకలాపాలు ప్రారంభమైన దాఖలాలు ఇంకా కనిపించలేదు. అయితే ఈ నౌక కొన్ని వారాల్లో మాల్దీవుల తీరాని చేరుకుంటుదనే సమాచారం తెలిపారు. శ్రీలంక తీరంలో కూడా గతంలో ఇదే మాదిరిగా చైనా నౌక తీరానికి రావడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో శ్రీలంక తీరంలో నిఘా కార్యకలాపాలు వ్యవహరించడంపై అప్పట్లో భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

         భారత్ ఈఈజెడ్ లోకి చైనా పరిశోధన నౌక ఎలాంటి అనుమతి లేకుండా 2019లో తీరంలోకి ప్రవేశించింది. ఆ వెంటనే భారత్ చైనా నౌకను తరిమేసింది. ఇదే విధంగా గత ఏడాది వరకు శ్రీలంకలో లంగరేశాయి. కానీ ఈసారి కొలం బో ఇందుకు అంగీకరించలేదు. ఈ నౌకలు సైనిక -పౌర ప్రయోజనాలకు సంబంధించినవని భారత్ నేవీ అధికారులు ఆరోపిస్తున్నారు. చైనా పరిశోధన నౌక నిఘా సమాచారాన్ని సేకరిస్తాయని, భారత్ నేవీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ పరిశోధన నౌకలు పోర్టులు, అణు కేంద్రాలపై కూడా నిఘా వేసి, సమాచారాన్ని కొల్లగొట్టగలవని తెలుస్తోంది. అయితే తమ పరిశోధక నౌకను సాధారణ దృష్టితో చాడాలని భారత్ ను ఉద్దేశించి గతంలో చైనా వ్యాఖ్యానించింది.

       ఇటీవల మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ చైనా అనుకూల పార్టీగా పేరుగాం చింది.ఆ అనుమానానికి తగ్గట్టే ఆయన భారత్ తో వివాదం తలెత్తిన సమయంలోనే బీజింగ్ పర్యటించారు.వారి దేశంలోని సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని, భారత్ ను కోరడం జరిగింది. ఇదిలా ఉండగానే ఈ తాజా పరిణామం చోటు చేసుకుంది.

Latest Articles

కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు నిజంగానే కోరుకుంటున్నారా?

తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి సరికొత్త మైండ్ గేమ్‌కు తెరతీసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. కేటీఆర్, హరీశ్ రావు ద్వయం ఒక కొత్త...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్