పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. బీజేపీకి మాజీమంత్రి ముకేష్ గౌడ్ కుమా రుడు, యువనేత విక్రమ్ గౌడ్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను.. పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. పార్టీలో కొత్త వారిని అంటరాని వారుగా చూస్తున్నారని ఆరోపించారు. క్రమశిక్షణకు మారు పేరంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పని చేసినా గుర్తింపు ఇవ్వడం లేదదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో ఒక గ్రూప్ రాజకీయాలలో ఉంటేనే పార్టీలో మనుగడ అని అన్నారు. ప్రజాబలం లేని వారికి పెద్దపీట వేసి వారి కింద పనిచేయాలని చెబుతున్నారని వాపోయారు. ఎన్నికల్లో ఓటమికి ఎవరు బాధ్యత తీసుకోలేదని తెలిపారు. అవేదనతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని విక్రమ్ గౌడ్ చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీకి షాక్
0
318
Previous article
Next article
Latest Articles
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యల దుమారం
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హరీశ్ రావు క్షుద్రపూజలు చేస్తున్నారని మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపిస్తే... కాదు రేవంత్ రెడ్డే క్షుద్రపూజలు చేస్తున్నారని దాసోజు శ్రవణ్ కౌంటరిచ్చారు. వర్షాలు పడకూడదని,...
- Advertisement -
- Advertisement -


