తెలంగాణలో సరిగ్గా నెల క్రితం అధికారం చేపట్టిన, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన, ఆరు గ్యారెంటీలను అమలు చేసే ప్రక్రియ ప్రారంభించింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన రెండు హామీలను అమలు చేసి తెలంగాణ ప్రజల్లో నమ్మకాన్ని పెంచింది. రేవంత్ రెడ్డి సీఎంగా అధికారం చేపట్టిన మరుసటి రోజు నుండే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించారు. అలాగే ఆరోగ్యశ్రీని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచారు. ఈ నేపథ్యంలో ఆరు గ్యారెంటీలను పూర్తిచేసే పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం. ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వం ప్రజల నుండి ఈ నెల 6 వ తేదీ వరకు 6 గ్యారంటీల పథకాలకు సంబంధించిన అర్జీలను స్వీకరించింది. ఇదిలా ఉండగా రేషన్ కార్డ్ ఉన్నవారు కేవైసీని జనవరి 31 లోపు పూర్తి చేసుకోవాలని చెప్పారు. రేషన్ కార్డులో నమోదైన ప్రతి ఒక్క సభ్యుడు,న సభ్యురాలు కేవైసీ పూర్తి చేసుకోమని సూచించింది. సమీప రేషన్ డీలర్ వద్ద మాత్రమే ఈ పాస్ మిషన్ ద్వారా వేలిముద్రలు ఇవ్వాలని సూచించారు. అయితే ఆధార్ అప్డేషన్ చేసుకోని వారికి ఈ కేవైసీలు నిలిచిపోతా యని హెచ్చరించారు.
రేషన్ కార్డ్ హోల్డర్స్ కేవైసీకి జనవరి 31 ఆఖరు
0
658
Previous article
Next article
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


