25.2 C
Hyderabad
Wednesday, February 4, 2026
spot_img

హాలీవుడ్‌ నటుడు క్రిస్టియన్ ఒలివర్‌ మృతి

      విమాన ప్రమాదంలో హాలీవుడ్‌ నటుడు క్రిస్టియన్ ఒలివర్‌ మృతి చెందారు. ఆయనతో పాటు ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయారు. వారు ప్రయాణిస్తోన్న చిన్నపాటి విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కరీబియన్ సముద్రంలో కూలిపోయింది. తీర రక్షక దళం ఘటనా స్థలం నుంచి వీరి ముగ్గురితోపాటు పైలట్‌ మృతదేహాన్ని వెలికితీసింది. జర్మనీలో జన్మించిన క్రిస్టియన్‌ ఒలివర్ వయస్సు 51 సంవత్సరాలు. ఇద్దరు కుమార్తెలు అన్నిక్‌, మదితాతో కలిసి ఆయన ప్రైవేటు విమానంలో బెక్వియా నుంచి సెయింట్ లూసియాకు వెళ్తోన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఒలివర్‌.. హాలీవుడ్‌తో పాటు జర్మనీలో పలు టీవీ సిరీస్‌ల్లో నటించారు. కోబ్రా 11 సిరీస్‌తో మంచి పేరు సొంతం చేసుకున్నారు. ‘ది గుడ్ జర్మన్‌’, ‘స్పీడ్ రేసర్‌’ సహా మొత్తం 60 సినిమాల్లో ప్రేక్షకులను అలరించారు.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్