32.8 C
Hyderabad
Monday, March 16, 2026
spot_img

వైసీపీకి మరో షాక్ – దాడి రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమీపిస్తున్న వేళ అధికార పార్టీ వైసీపీకి షాకులు మీద షాకులు వేగంగా తగులుతున్నాయి. ఇటీవల వైసీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేల కు టికెట్ ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పడంతో సిట్టింగ్ ల్లో కలకలం రేగింది. పైకి నిశ్శబ్దంగా ఉన్నా లోపలలోపల ఉడికి పోతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. నియోజకవర్గాల వారీగా మార్పులు చేర్పులు చేయడంతో టికెట్ రాదని భావించిన నేతలంతా పార్టీకి నీళ్లొదిలి పోతున్నారు. తెలంగాణ ఫలితాలు వెలువడిన నాటి నుండి సిట్టింగ్ లు పై వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అనేక మంది ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలుపార్టీని వీడి జనసేన, డీడీపీలలో చేరుతున్నారు. తాజాగా వైసీపీకి దాడి వీరభద్రరావు సైతం రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపించారు. గత కొంతకాలంగా గుడివాడ అమర్నాథ్ తోఉన్న విభేదాలను వైసీపీ అధిష్టానం పట్టించుకోక పోవడంతో దాడి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

దాడి రాజీనామా అనంతరం ఏ పార్టీలో చేరాలా అనేది ఫ్యామిలీ మెంబర్స్ తో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు సమా చారం. అయితే గతంలో దాడిని జనసేన అధినేత పవన్ తన పార్టీలోకి ఆహ్వానించాడు. దీంతో ఆయన కుమా రుడు రత్నాకర్ చేరతారనే వాదనలు వినిపించాయి. ఇదిలా ఉండగా గతంలో టీడీపీ లో ఉన్న దాడి 2014 ఎన్నికల కంటే ముందు వైసీపీలో చేరడం జరిగింది. అయితే ఆయనకు అక్కడ కూడా పెద్దగా గౌరవం దక్కలేదు. గత ఎన్నికల్లో అనా కాపల్లి ఎమ్మెల్యే సీటును గుడివాడ అమర్నాథ్ కు కేటాయించారు జగన్ . విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని రత్నా కర్ కు కేటాయించారు. అయితే అక్కడ దాడి రత్నాకర్ ఓడిపోయాడు. దీంతో వైసీపీ అధిష్టానం తనని పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలోనే దాడి వీరభద్రరావు వైసీపీని వీడి బయటకు వస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే రాజకీయ భవిష్యత్తుపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని మీడియాకు వెల్లడించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్