ప్రో కబడ్డీ లీగ్ సీజన్-10 కోసం తెలుగు టైటాన్స్ కొత్త జట్టు

ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 ప్రాథమిక దశ పోటీలు అహ్మదాబాద్‌లోని ట్రాన్స్‌స్టేడియంలోని ఏకా అరేనాలో జరగనున్నాయి. డిసెంబర్ 2న ప్రారంభం కానున్న ఈ పోటీలు 2024 ఫిబ్రవరి 21 వరకు జరుగనున్నాయి. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 కోసం కొత్త జట్టును తెలుగు టైటాన్స్ ప్రకటించింది. ప్లేఆఫ్ రౌండ్‌లోకి ప్రవేశించిన టాప్ సిక్స్‌తో ఇతర 11 జట్ల మాదిరిగానే తెలుగు టైటాన్స్ 22 లీగ్ దశ మ్యాచ్‌లు ఆడుతుంది.
తెలుగు టైటాన్స్ సీజన్ 10కి పవన్ కుమార్ సెహ్రావత్‌ను కెప్టెన్‌గా,  పర్వేష్ భైన్‌స్వాల్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించింది.
టీమ్ తెలుగు టైటాన్స్ సీజన్ 10. జట్టులో డిఫెండర్లుగా పర్వేష్ భైన్‌స్వాల్, మోహిత్, నితిన్, అంకిత్, సి మిలాద్ జబ్బారి (విదేశీ), గౌరవ్ దహియా, అజిత్ పాండురంగ్ పవార్, మోహిత్, సందీప్ ధుల్ వ్యవహరిస్తారు. అలాగే ఆల్ రౌండర్లుగా రజనీష్, సంజీవి ఎస్, బి హమీద్ మీర్జాయ్ నాడర్ (విదేశీ), శంకర్ భీమ్‌రాజ్ గడై, ఓంకార్ ఆర్ మోర్, ఇక
రైడర్స్‌గా పవన్ కుమార్ సెహ్రావత్, ఓంకార్ నారాయణ్ పాటిల్, ప్రఫుల్ సుదమ్ జవారే, రాబిన్ చౌదరి వ్యవహరించనున్నారు. ఇక ప్రధాన కోచ్ శ్రీనివాస్ రెడ్డి కాగా సహాయ కోచ్‌గా శ్రీ అలెక్స్ పాండియన్ వ్యవహరించనున్నారు.
నూతన జట్టు ప్రకటన సందర్భంగా తెలుగు టైటాన్స్ టీమ్ యజమాని  గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ “ఇండియా ఇంటర్నేషనల్ పవన్ కుమార్ సెహ్రావత్‌ను ఈ ఏడాది వేలంలో రికార్డు స్థాయిలో రెండు కోట్లకుపైగా వెచ్చించి తెలుగు టైటాన్స్ సొంతం చేసుకుంది. లీగ్ చరిత్రలో అత్యధికంగా చెల్లించిన ఆటగాడిగా నిలిచాడు. కబడ్డీ  క్రీడను కొనసాగించే వారందరికీ వృత్తిలో గౌరవ భావాన్ని  తెలుగు టైటాన్స్ తీసుకువచ్చింది. లీగ్ (PKL) 2014లో ప్రారంభమైనప్పటి నుండి ఆకాశమే హద్దుగా ఈ క్రీడ విస్తరించింది, అశేషమైన  అభిమానులకు ఇష్టమైన క్రీడగానూ మారింది ” అని అన్నారు.
 తెలుగు టైటాన్స్  సీఈఓ త్రినాధ్ రెడ్డి  మాట్లాడుతూ “ప్రపంచంలోని అత్యుత్తమ కబడ్డీ అథ్లెట్లు తెలుగు టైటాన్స్‌లో ఆడేలా చూసుకున్నాము. నేడు దేశంలోని అన్ని ప్రాంతాల్లో కబడ్డీ ఆడే యువత చాలా ఎక్కువ. అత్యధిక ధర పలికిన వ్యక్తిగా పవన్ తన రికార్డును తిరిగి పొందడం చాలా సంతోషంగా  ఉంది. ఇది ఆర్థికంగా లాభదాయకమైన మోడల్‌ను అభివృద్ధి చేసింది, ఇది క్రీడతో సంబంధం ఉన్న అథ్లెట్ల కలలకు రెక్కలు ఇచ్చింది…” అని అన్నారు.
ప్రో కబడ్డీ సీజన్ 10 (తెలుగు టైటాన్స్) మ్యాచ్ ఈ క్రింది విధంగా ఉంది:
*డిసెంబర్ 2(శనివారం)- తెలుగు టైటాన్స్ VS గుజరాత్ గెయింట్స్- 8pm onwards
*డిసెంబర్ 6(బుధవారం)- తెలుగు టైటాన్స్ VS పాట్నా పైరేట్స్- 8pm onwards
*డిసెంబర్ 9(శనివారం)- తెలుగు టైటాన్స్ VS యూపీ యోధాస్- 9pm onwards
*డిసెంబర్ 13(బుధవారం)- తెలుగు టైటాన్స్ VS తమిళ్ తళైవాస్- 8pm onwards
*డిసెంబర్ 16(శనివారం)- తెలుగు టైటాన్స్ VS దబాంగ్ ఢిల్లీ కేసీ- 9pm onwards
*డిసెంబర్ 22(శుక్రవారం)- తెలుగు టైటాన్స్ VS హర్యానా స్టీలర్స్- 9pm onwards
*డిసెంబర్ 24(ఆదివారం)- తెలుగు టైటాన్స్ VS బెంగళూరు బుల్స్- 9pm onwards
*డిసెంబర్ 30(శనివారం)- తెలుగు టైటాన్స్ VS యూ ముంబా- 8pm onwards
*జనవరి 1(సోమవారం)- తెలుగు టైటాన్స్ VS పునేరి పల్తాన్- 8pm onwards
*జనవరి 6(శనివారం)- తెలుగు టైటాన్స్ VS జైపూర్ గుజరాత్ గెయింట్స్- 9pm onwards
*జనవరి 9(మంగళవారం)- తెలుగు టైటాన్స్ VS బెంగాల్ వారియర్స్- 8pm onwards
*జనవరి 12(శుక్రవారం)- తెలుగు టైటాన్స్ VS జైపూర్ పింక్ పాంథర్స్- 8pm onwards
*జనవరి 19(శుక్రవారం)- తెలుగు టైటాన్స్ VS బెంగళూరు బుల్స్- 9pm onwards
*జనవరి 20(శనివారం)- తెలుగు టైటాన్స్ VS యూపీ యోధాస్- 9pm onwards
*జనవరి 22(సోమవారం)- తెలుగు టైటాన్స్ VS హర్యానా స్టీలర్స్- 9pm onwards
*జనవరి 24(బుధవారం)- తెలుగు టైటాన్స్ VS తమిళ్ తళైవాస్- 9pm onwards
*జనవరి 30(మంగళవారం)- తెలుగు టైటాన్స్ VS పునేరి పల్తాన్- 8pm onwards
*ఫిబ్రవరి 3(శనివారం)- తెలుగు టైటాన్స్ VS దబాంగ్ ఢిల్లీ కేసీ- 9pm onwards
*ఫిబ్రవరి 10(శనివారం)- తెలుగు టైటాన్స్ VS బెంగాల్ వారియర్స్- 9pm onwards
*ఫిబ్రవరి 13(మంగళవారం)- తెలుగు టైటాన్స్ VS పాట్నా పైరేట్స్- 8pm onwards
*ఫిబ్రవరి 16(శుక్రవారం)- తెలుగు టైటాన్స్ VS జైపూర్ పింక్ పాంథర్స్- 9pm onwards
*ఫిబ్రవరి 20(మంగళవారం)- తెలుగు టైటాన్స్ VS యూ ముంబా- 8pm onwards

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్