స్వతంత్ర వెబ్ డెస్క్: నేను కందిపప్పు అయితే… కేటీఆర్ గన్నేరు పప్పు అంటూ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆల్ ఇండియా పప్పు రాహుల్, తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి అని సెటైర్లు పేల్చారు మంత్రి KTR. నిన్న కాళేశ్వరంలో రాహుల్, రేవంత్ పర్యటన పై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రీ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలోనే రాచరిక పోకడల గుర్తులు కనిపిస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ప్రజల త్యాగాల గుర్తులు ఉండాలని చెప్పారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో పోరాటాల స్ఫూర్తి కనిపించడం లేదని తెలిపారు. తెలంగాణ కోసం ఎందరో యువకులు ప్రాణత్యాగం చేశారన్న రేవంత్ రెడ్డి.. ఈ పదేళ్లలో కేసీఆర్ ఏం చెప్పారు.. ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలని కోరారు. పేదల సంక్షేమం కోసం నిధులు ఉపయోగపడ్డాయో లేదో ప్రజలు ఆలోచించాలని సూచించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
నేను కందిపప్పు అయితే… కేటీఆర్ గన్నేరు పప్పు- రేవంత్ రెడ్డి
0
498
Latest Articles
క్షమాపణ చెబుతారని అనుకన్నా.. కానీ డైవర్షన్ చేస్తున్నారు- స్పీకర్
అసెంబ్లీ దగ్గర నిన్న జరిగిన ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని అనుకున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. వాస్తవానికి మైక్ ఇవ్వద్దు.. తాను స్పీకర్‌గా నాలుగు వైపుల...
- Advertisement -
- Advertisement -


