స్వతంత్ర వెబ్ డెస్క్: శ్రీలంకలో జరిగిన మ్యాచ్ లో టీమిండియా స్టార్ పెసర్ మహమ్మద్ షమీ 5 వికెట్లు పడగొట్టారు. ఇప్పటివరకు వరల్డ్ కప్ లో అతడు మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలో మిచెల్ స్టార్క్(3) రికార్డును సమంచేశాడు. WC చరిత్రలో వీరిద్దరే మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశారు. షాహిన్ ఆఫ్రిది, ముస్తాఫిజుర్ రహ్మాన్, షాహిద్ ఆఫ్రిది, గ్లెన్ మెక్ గ్రాత్ రెండుసార్లు చొప్పున 5 వికెట్ల ప్రదర్శన చేశారు. కాగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా మరోసారి తన సత్తాను చాటింది. శ్రీలంక జట్టుపై ఏకంగా 302 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. ముంబైలోని వంఖాడే వేదికగా ఈ మ్యాచ్ లో అద్భుత విజయం సాధించి నేరుగా సెమిస్ కు చేరింది టీమిండియా జట్టు.
World Cup 2023 : జహీర్, శ్రీనాథ్ లను అధిగమించిన షమీ
0
341
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


