ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్…సంక్రాంతికి మరో 5 లక్షల ఇళ్లు

స్వతంత్ర వెబ్ డెస్క్: వచ్చే సంక్రాంతి నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఐదు లక్షల పేదల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆదేశించారు. తాజాగా విజయవాడలోని గృహ నిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం పై సమీక్ష నిర్వహించారు మంత్రి జోగి రమేష్. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి పక్కా గూడు కల్పించాలని దూడ సంకల్పంతో ఈ పథకాన్ని సీఎం జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఈ పథకం కింద ఐదు లక్షలకు పైగా నిర్మించినట్లు తెలిపారు జోగి రమేష్. మిగిలిన ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ పనులలో అలసత్వం వహించకూడదని ఆదేశించారు. ఇల నిర్మాణాలతో పాటు జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాల పనులను కూడా వేగవంతం చేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు జోగి రమేష్.

Latest Articles

ధనుష్‌.. ప్లాన్ అదిరింది..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్