స్వతంత్ర వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ ఏటీఎంలా కాళేశ్వరం ప్రాజెక్ట్ పని చేసిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు వెళ్లిన రాహుల్… భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో మహిళా ఆత్మీయ సమ్మేళనంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. సీఎం కేసీఆర్ కు కాలేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని రాహుల్ గాంధీ విమర్శించారు. ‘తెలంగాణ సంపద దోపిడికి గురవుతోంది. కేసీఆర్ దోచుకున్న సొమ్మును మహిళల ఖాతాల్లో వేస్తాం. దోరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. BRS, BJP, MIM… మూడు ఒకటే’ అని రాహుల్ విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్టు బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎంల మారిందని విమర్శించారు. లక్షల కోట్ల ప్రజాధనం వృధా అయిందని, ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిని కల్లారా చూద్దామని, దాన్ని ప్రజలకు వివరిద్దామని తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. అనంతరం మేడిగడ్డ ప్రాజెక్టును చూసేందుకు తరలి వెళ్లారు. అక్కడ మేడిగడ్డ ప్రాజెక్టును చూసి.. హైదరాబాద్ వెళ్లి పోయారు రాహుల్ గాంధీ.
సీఎం కేసీఆర్ కు ఏటీఎంలా కాళేశ్వరం ప్రాజెక్ట్ – రాహుల్ గాంధీ
0
365
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


