స్వతంత్ర వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీకి విష్ణువర్ధన్ రెడ్డి రాజీనామా చేసినట్లు సమాచారం అందుతోంది. జూబ్లీహిల్స్ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీపై విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ టికెట్ పీజేఆర్ కొడుకుకి కాకుండా మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు కేటాయించడంతో ఆగ్రహంగా ఉన్నారు విష్ణు. టికెట్ ఇస్తే బీజేపీ నుండి లేదా ఇండిపెండెంట్‌గా విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. అయితే.. టికెట్ రాకపోవడంపై తాజాగా విష్ణు వర్దన్ రెడ్డి కూడా స్పందించారు. ఒక్కొక ఇంట్లో రెండు రెండు టిక్కెట్లు ఇచ్చారు.. కొందరు అయ్యలకు, హాఫ్ టికెట్ గాళ్ళకి టికెట్ ఇచ్చారని ఆగ్రహించారు విష్ణువర్ధన్ రెడ్డి. పార్టీకోసం కష్టపడ్డా, హైదరాబాద్‌లో కాంగ్రెస్ అంటే పీజేఆర్ అనేవాళ్ళు అన్నారు. జూబ్లీహిల్స్ నుంచి పోటీలో ఉంటా, త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ప్రకటన చేశారు విష్ణువర్ధన్ రెడ్డి. మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.
కాంగ్రెస్ కు విష్ణువర్ధన్ రెడ్డి రాజీనామా !
0
396
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


