24.2 C
Hyderabad
Monday, June 16, 2025
spot_img

కాంగ్రెస్ బలహీనంగా ఉంది.. రమ్మని పిలిస్తే వచ్చాను- రాజగోపాల్ రెడ్డి

స్వతంత్ర వెబ్ డెస్క్: కాంగ్రెస్ బలహీనంగా ఉంది.. రమ్మని పిలిస్తే వచ్చానన్నారు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి. బీజేపీ పార్టీ అందుకే వీడానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలవబోతోందని కీలక వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సీఎం కేసీఆర్‌ ను ఓడించేందుకు.. బీజేపీలో నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చానన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు మోత్కుపల్లి నరసింహులు. మోత్కుపల్లి నరసింహులుతో పాటు… కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ను గద్దే దింపేందుకు కాంగ్రెస్ లో చేరానన్నారు. పదవులు నాకు ముఖ్యం కాదని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని చెప్పారు. కుటుంబ పాలనను అంతం చేస్తానని… కాంగ్రెస్ పార్టీ 70 సీట్లు గెలవబోతోందని జోష్యం చెప్పారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్