స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రముఖ కళాకారుడు, యాంకర్ బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. నిన్న సత్తి…. ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావుతో భేటీ అయ్యారు. ముదిరాజ్ సామాజిక వర్గంతో పాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన వారు బీఆర్ఎస్ తో కలిసి పని చేయాలని కేటీఆర్, హరీష్ కోరినట్లు సమాచారం. ఇందుకు బిత్తిరి సత్తి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఓవైపు సభలు, సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోవైపు సోషల్ మీడియాలోనూ తన జోరు చూపిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్‌లోకి బిత్తిరి సత్తి.. కీలక పదవికి ఒప్పందం?
0
447
Previous article
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


