ద్విభాషా చిత్రంతో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొంది చెప్పుకోదగ్గ విజయం సాధించిన “భద్రం బి కేర్ ఫుల్ బ్రదరు”తో హీరోగా పరిచయమైన యువ కథానాయకుడు రాజ్ దాసిరెడ్డి… ఓ ద్విభాషా చిత్రంలో నటించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఊటీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందే ఈ విభిన్న ప్రేమ కథా చిత్రం కోసం ఊటీలో ఇప్పటివరకు షూటింగ్ చేయని అత్యద్భుత లోకేషన్లు అన్వేషిస్తున్నారు!!

“భద్రం బి కేర్ ఫుల్ బ్రదరు” విజయానంతరం రాజ్ దాసిరెడ్డికి తెలుగులో పలు ఆఫర్స్ వచ్చినప్పటికీ… అదే సమయంలో ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం రావడంతో తెలుగులో అవకాశాలను సద్వినియోగపరచుకోలేకపోయాడు. హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం వివిధ అంశాల్లో శిక్షణ తీసుకుంటూ అమెరికాలోని “న్యూయార్క్”లో ఉండిపోవాల్సి వచ్చింది. అయితే విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా తెరకెక్కనున్న సదరు ప్రాజెక్ట్ సెట్స్‌కి వెళ్లేందుకు మరింత సమయం పడుతుండడంతో ఈలోపు ఓ ద్విభాషా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రాజ్ దాసిరెడ్డి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి!!

Latest Articles

పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు

తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో సమావేశమైన ఎగ్జిబిటర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందేనని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్