నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్ధి అతడే.. క్లారిటీ ఇచ్చిన విజయసాయి రెడ్డి..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో  అన్ని పార్టీల్లో  ఎవ్వరికీ టికెట్ కేటాయించాలనే ఉత్కంఠ నెలకొంది. ఆశావాహులు టికెట్ కోసం ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ చేస్తున్నారు. అధికార వైసీపీలో కొందరు నేతలు ప్రచారానికి దూరంగా వున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అసంతృప్తితో వున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన ఈసారి ఎన్నికల్లో పోటీగా దూరంగా ఉంటారనే టాక్ వినిపించింది.

ఈ నేపథ్యంలో వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానం నుంచి అనిల్ కుమార్ యాదవ్ బరిలో ఉంటారని  తెలిపారు. అలాగే నెల్లూరు లోక్‌సభ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన ప్రకటనతో నెల్లూరు రాజకీయాలు సెట్ అయినట్లేనని భావిస్తున్నారు.  నెల్లూరులో ఈ పరిస్ధితికి వైసీపీలో గ్రూపులే ప్రధాన కారణమనే టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు అనిల్ కుమార్ యాదవ్‌కు అన్నీ తానై అండగా నిలిచారు ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్.

అయితే రూప్ కుమార్ వేరు కుంపటి పెట్టడం.. అనిల్‌పై నేరుగా విమర్శలు దిగడంతో వైసీపీ కేడర్‌ రెండుగా చీలిపోయింది. ఈ పంచాయతీ అధిష్టానం వరకు చేరడంతో ఇద్దరికి రాజీ కుదార్చారు పెద్దలు. అయినప్పటికీ వివాదానికి తెర పడలేదని, ఈసారి అనిల్ పోటీ చేసినా రూప్ కుమార్ సహకరించరనే ఊహాగానాలు వినిపించాయి. కానీ అధిష్టానం మాత్రం అనిల్‌కే టికెట్ అని స్పష్టం చేసింది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్